Prabhas Spirit : ఆ లెక్కన ‘స్పిరిట్’ కలెక్షన్స్ 2000 కోట్లు దాటాలి.. ప్రభాస్ సినిమాపై సందీప్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్..
తాజాగా బాలీవుడ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కలెక్షన్స్ గురించి మాట్లాడాడు.

Sandeep Reddy Vanga Interesting Comments on Prabhas Spirit Movie Collections
Prabhas Spirit : సందీప్ రెడ్డి వంగ తాను తీసిన మూడు సినిమాలతోనే టాలీవుడ్, బాలీవుడ్ ని షేక్ చేసాడు. అర్జున్ రెడ్డితో విజయ్ కి పెద్ద హిట్ ఇచ్చాడు. దాని రీమేక్ కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ కి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇక రణబీర్ కపూర్ కి కూడా యానిమల్ సినిమాతో కెరీర్లోనే పెద్ద హిట్ ఇచ్చాడు. యానిమల్ సినిమా 800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ రెండు సినిమా షూటింగ్స్ అవ్వగానే ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఈ సంవత్సరం చివర్లో మొదలు కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. సందీప్ రెడ్డి తో ప్రభాస్ సినిమా, అందులోను పోలీస్ పాత్ర కావడంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా బాలీవుడ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కలెక్షన్స్ గురించి మాట్లాడాడు. హోస్ట్ మీరు హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్, బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రభాస్ కి కూడా ఇస్తున్నారా అని అడగడంతో సందీప్ రెడ్డి.. ఆ లెక్కన చూసుకుంటే నా సినిమా బాహుబలిని దాటాలి. అంటే 2000 కోట్లు కలెక్ట్ చేయాలి. అది చాలా పెద్ద అమౌంట్. ప్రస్తుతానికి నేను సినిమా మీదే ఫోకస్ పెట్టాను, కలెక్షన్స్ గురించి ఆలోచించట్లేదు. చూద్దాం సినిమా రిలీజయ్యాక బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో అని అన్నారు.
Also Read : Mega Family : మెగాస్టార్ కి, మెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్న వాళ్లపై నెగిటివ్ ప్రచారం..?
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరిన్ని హోప్స్ పెంచేసుకొని స్పిరిట్ 2000 కోట్లు కొట్టేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల్లో అమీర్ ఖాన్ దంగల్ 2000 కోట్లతో మొదటి ప్లేస్ లో ఉంది. ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 1850 కోట్లు కలెక్ట్ చేసి రెండవ ప్లేస్ లో నిలిచింది. ఇన్నాళ్లు రెండో ప్లేస్ లో ఉన్న బాహుబలి 1810 కోట్లతో మూడో ప్లేస్ లో ఉంది. సందీప్ కాన్ఫిడెంట్ చూస్తుంటే ప్రభాస్ స్పిరిట్ సినిమా రెండో ప్లేస్ లోకి కానీ కుదిరితే ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్తుంది అని అంటున్నారు ఫ్యాన్స్. మరి స్పిరిట్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.