Aadhi Pinisetty : ‘రంగస్థలం’ షూటింగ్ సెట్ నుంచి దొంగతనం చేసిన ఆది పినిశెట్టి.. ఎవ్వరికి తెలీదంట.. సీక్రెట్ రివీల్..
ఆది పినిశెట్టి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమా గురించి పలు విషయాలు మాట్లాడి ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.

Aadhi Pinisetty Theft a Item from Ram Charaan Rangasthalam Set
Aadhi Pinisetty : హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు ఆది పినిశెట్టి. తాజాగా హారర్ థ్రిల్లర్ ‘శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను భయపెడుతుంది. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి రామ్ చరణ్ కి అన్నయ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శబ్దం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆది పినిశెట్టి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమా గురించి పలు విషయాలు మాట్లాడి ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
Also Read : Mega Family : మెగాస్టార్ కి, మెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్న వాళ్లపై నెగిటివ్ ప్రచారం..?
రంగస్థలం సినిమా గురించి మాకు తెలియని విషయం ఏదైనా ఉంటే చెప్పండి అని హోస్ట్ అడగ్గా ఆది పినిశెట్టి.. నేను రంగస్థలం సినిమాలో పెట్టుకున్న కళ్ళజోడు ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చేసుకున్నాను. అది నా దగ్గరే ఉంది. ఈ విషయం ఎవరికీ తెలీదు అని చెప్పాడు. సాధారణంగా ఆది కళ్ళజోడు వాడడు. రంగస్థలం సినిమాలో ఆది పాత్రకు కళ్ళజోడు ఉంటుంది. ఆ కళ్ళజోడు మూవీ యూనిట్ ప్రాపర్టీ. అయితే షూటింగ్ అయిపోయాక ఎవరికీ చెప్పకుండా ఆ కళ్లజోడుని సైలెంట్ గా తెచ్చేసుకున్నాడట. దాని గురించి ఎవ్వరూ అడగలేదని తెలిపాడు. ఇప్పటికి ఆ కళ్ళజోడు దాచుకున్నట్టు తెలిపాడు ఆది.
Also Read : Roja – Srikanth : శ్రీకాంత్ తో రోజా డ్యాన్స్.. టీవీ షో ప్రోమో వైరల్.. రీ ఎంట్రీలో అదరగొడుతున్న రోజా..
అంత పెద్ద సినిమాలో ఆ చిన్న కళ్ళజోడు ఎవరూ పట్టించుకోరు కానీ చెప్పకుండా ఆది సరదాగా తీసుకెళ్లిపోవడం గమనార్హం. ఇక చరణ్ గురించి చెప్తూ.. చరణ్ కు, నాకు సినిమా సమయంలో మంచి బాండింగ్ కుదిరింది. మేమిద్దరం చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటాం. కానీ సినిమా అయ్యాక మాత్రం ఎక్కువ టచ్ లో లేము. బయట ఎక్కడైనా కనిపిస్తే మాత్రం హాయ్ అని పలకరించి మాట్లాడుకుంటాం అని తెలిపాడు.