Mega Family : మెగాస్టార్ కి, మెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్న వాళ్లపై నెగిటివ్ ప్రచారం..?
మెగాస్టార్ చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి దగ్గరైన వాళ్లపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

Negative Promotions on who Supports Megastar Chiranjeevi and Mega Family Fans Discussions in Social Media
Mega Family : ఇటీవల సోషల్ మీడియాలో నెగిటివిటి బాగా పెరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది పనిగట్టుకొని మరీ ఈ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఫ్యాన్స్ కూడా కొంత భాగమవుతున్నారు. ఓ హీరో ఫ్యాన్స్ ఇంకో ఫ్యాన్స్ పై, ఆ హీరోకి దగ్గరగా ఉండే హీరోపై విమర్శలు చేస్తున్నారు. తమ హీరోని పొగుడుకోవడంలో తప్పు లేదు కానీ పక్క హీరోని తిడుతూ, ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్ వార్స్ ఎక్కువవుతున్నాయి.
ఇటీవల కొంతమంది హీరోలు కూడా నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ పీఆర్ గురించి బహిరంగంగానే మాట్లాడారు. కిరణ్ అబ్బవరం, మంచు విష్ణు, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్.. ఇలా పలువురు హీరోలు మా మీద కొంతమంది కావాలని నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారు అన్నారు. నాగ చైతన్య కూడా ఇండస్ట్రీలో నెగిటివ్ పీఆర్ నడుస్తుంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ కొత్త టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి దగ్గరైన వాళ్లపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. దీనిపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Roja – Srikanth : శ్రీకాంత్ తో రోజా డ్యాన్స్.. టీవీ షో ప్రోమో వైరల్.. రీ ఎంట్రీలో అదరగొడుతున్న రోజా..
గేమ్ ఛేంజర్ సినిమాకు ఏ రేంజ్ లో నెగిటివిటి వచ్చిందో అందరికి తెలిసిందే. కొంతమంది వేరే ఫ్యాన్స్, ఇంకొంతమంది కలిసి సినిమా రిలీజ్ ముందు నుంచి సినిమాపై నెగిటివ్ గా ప్రచారం చేసారు. రిలీజ్ అయిన రోజే సినిమాని లీక్ చేశారు. ఇన్నాళ్లు విశ్వక్ సేన్ నందమూరి కాంపౌండ్ అనేవాళ్ళు. ఆయన సినిమాలకు బాలకృష్ణ, ఎన్టీఆర్ గెస్ట్ లుగా వచ్చేవాళ్ళు. అయితే మొదటిసారి లైలా ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా రావడం, విశ్వక్ ఇండస్ట్రీలో కాంపౌండ్స్ ఏమి లేదు అనడంతో విశ్వక్ పై నెగిటివ్ ప్రచారం మొదలైంది. దానికి తోడు సినిమా ఈవెంట్లో పృథ్వి చేసిన వ్యాఖ్యలు తోడవడంతో అవి కూడా కలిపి విశ్వక్ పై, లైలా సినిమాపై దారుణంగా ట్రోల్ చేసారు.
ఇన్నాళ్లు సక్సెస్ డైరెక్టర్ గా ఎదిగిన అనిల్ రావిపూడిపై ఇప్పటిదాకా కేవలం క్రింజ్ కామెడీ సినిమాలు చేస్తాడు అని తప్ప ఇంకేవిధమైన నెగిటివ్ ప్రచారం రాలేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ అయిన తర్వాత చిరంజీవితో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అనిల్ రావిపూడి పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఓ హీరోయిన్ తో సంబంధం ఉంది అంటూ వీడియోలు కూడా చేసి యూట్యూబ్ లో పెట్టారు. దీనిపై ఇప్పటికే అనిల్ రావిపూడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను అని చెప్పాడు.
Also Read : Summer Movies 2025 : ఈ సారి సమ్మర్ సినిమాలు ఇవే.. పవర్ స్టార్, మెగాస్టార్, రౌడీ స్టార్.. అందరూ వరుసపెట్టి..
హీరో నానిపై గతంలో ఓ రెండు మూడు సార్లు నెగిటివ్ ప్రచారం జరిగినా పెద్దగా ఎవరూ పట్టించుకొలేదు. నాని చాలా సాఫ్ట్ గా ఉంటాడు, మంచి కంటెంట్ ఇస్తాడు అని అందరికి పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. కానీ ఇటీవల నాని నిర్మాణంలో చిరంజీవి సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచే నానిపై కూడా నెగిటివ్ గా ప్రచారం జరుగుతుంది. నాని ఓ హీరోపై నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నాడని, నాని ఓ హీరోని తొక్కేస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ హీరో, నాని మాత్రం బాగానే ఉన్నారు. ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గా ట్వీట్స్ కూడా వేసుకున్నారు ఇటీవలే. అయినా ఈ నెగిటివ్ ప్రచారం ఆగట్లేదు.
దీనికి తోడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటంతో పవన్ కి, మెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్న వారిపై పవన్ ని విమర్శించే వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఇలా గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీపైనే కాదు మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యే వాళ్లపై కూడా విమర్శలు వస్తున్నాయని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు మాత్రం తెలియట్లేదు. కిరణ్ అబ్బవరం, మంచు విష్ణు, నాగ చైతన్య అన్నట్టు ఎవరైనా కావాలని మెగా ఫ్యామిలీపై, వాళ్లకు దగ్గరయ్యే వారిపై నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఈ విషయంపైనే చర్చిస్తున్నారు.