Summer Movies 2025 : ఈ సారి సమ్మర్ సినిమాలు ఇవే.. పవర్ స్టార్, మెగాస్టార్, రౌడీ స్టార్.. అందరూ వరుసపెట్టి..

ఈ సారి సమ్మర్ థియేటర్ల నిండా సినిమాలతో కావల్సినంత ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యబోతోంది.

Summer Movies 2025 : ఈ సారి సమ్మర్ సినిమాలు ఇవే.. పవర్ స్టార్, మెగాస్టార్, రౌడీ స్టార్.. అందరూ వరుసపెట్టి..

So Many Movies in Summer 2025 Chiranjeevi Pawan Kalyan Vijay Deverakonda Manchu Vishnu

Updated On : March 1, 2025 / 9:13 PM IST

Summer Movies 2025 : ఈ సారి సమ్మర్ సూపర్ హాట్ గా ఉండడమే కాదు సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది. వేసవిలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ చూస్తే సమ్మర్ హౌజ్ ఫుల్ కావడం పక్కా అనిపిస్తోంది. సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మర్ ఈసారి హౌజ్ ఫుల్ అయిపోయేలా ఉంది. ఇప్పటికే ఎప్పుడో సమ్మర్ డేట్స్ మీద ఖర్చీఫ్ వేసుకున్న హీరోలు రిలీజ్ దగ్గరపడడంతో సినిమాల్ని కంప్లీట్ చేసేపనిలో బిజీగా ఉన్నారు.

హరిహర వీరమల్లు సినిమాపై ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేస్తోన్న పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లుతో ఎట్టి పరిస్థితిలోనూ మార్చి28న బాక్సాఫీస్ బరిలో దిగుతాడంటోంది చిత్రయూనిట్. ఇంకా పవన్ కు సంబంధించిన సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నా ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అయితే 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ని 1000 కోట్లతో కొల్లగొట్టడం ఖాయమంటున్నారు.

మార్చి 28 పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అనౌన్స్ చేసినా సరే అదే డేట్ కి నితిన్ కూడా తన సినిమా రాబిన్ హుడ్ ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ రాబిన్ హుడ్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల డైరెక్షన్లో రాబిన్ హుడ్ ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ లో గ్యారంటీగా రిలీజవుతుంది అంటున్నారు.

Also Read : Chhaava : విక్కీ కౌషల్, రష్మిక ‘ఛావా’ ఓవరాల్ 1000 కోట్ల సినిమా అవుతుందా? అందులో తెలుగు టార్గెట్ ఎంత..?

కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే మార్చి 28న పెద్ద సినమాలున్నా ఒక్క రోజు తేడాతో రిలీజ్ ప్లాన్ చేసుకుంది మ్యాడ్ స్క్వేర్ . మ్యాడ్ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార, శ్రీకర, ఫార్చ్యూన్ ఫోర్ నిర్మాతలుగా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతున్న మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ పార్ట్ కి మించిన హిట్ గ్యారంటీ అంటోంది టీమ్.

మార్చి వరకు ఒక్క లెక్క ఏప్రిల్ నుంచి మరో లెక్క. సమ్మర్ మూవీల లిస్ట్ చూస్తే అలానే అనిపిస్తోంది. మార్చిలో 2, 3 పెద్ద సినిమాలుంటే ఏప్రిల్ లో మాత్రం వరసపెట్టి యంగ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ లో అన్నీ యూత్ ని ఎట్రాక్ట్ చేసేలా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ తో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి సినిమాలు. డీజే టిల్లు తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధూ జొన్నలగడ్డ ఏప్రిల్ 10న జాక్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో హిట్ ట్రాక్ మీదున్న సిద్ధూ సినిమా వస్తోందంటే ఆడియెన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.

లాంగ్ గ్యాప్ తర్వత పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో అనుష్క ఏప్రిల్ లో ఆడియెన్స్ ముందుకు రానుంది. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క నటించిన ఘాటి ఏప్రిల్ 18న థియేటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్ మరోసారి పవర్ ఫుల్ అనుష్క ని చూపిస్తున్నట్టు హింట్ ఇచ్చింది. సినిమాపై ఇప్పటి వరకు బజ్ లేకపోయినా స్వీటీ ఫ్యాన్స్ మాత్రం అనుష్కను స్కీన్ మీద చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఏప్రిల్ 25న మంచు విష్ణు ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

Also Read : Good Bad Ugly : అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్ వచ్చేసింది.. మాస్ లుక్స్ తో అజిత్ అదరగొట్టాడుగా..

పీక్ సమ్మర్ మే లో కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ కి మించిన బిజినెస్ మేలో జరుగుతుందంటూ ఇప్పటికే టాక్ నడుస్తోంది. హిట్ 3 సినిమా మే 1న థియేటర్స్ లో సందడి చేయనుంది. అర్జున్ సర్కార్ గా టీజర్ లో నాని ఫెర్మార్మెన్స్ ఆడియెన్స్ లో మూవీపై అంచనాలు పెంచేసింది. శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో రాబోతున్న థర్డ్ పార్ట్ ని ఇంతకు ముందొచ్చిన సీక్వెల్స్ ని మించిన ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు నాని.

మెగాస్టార్ చిరంజీవి సోషియో-ఫాంటసీ మూవీ విశ్వంభరతో మే9న ఆడియెన్స్ ముందుకు వస్తున్నారంటూ టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. 150 కోట్ల బడ్జెట్ తో వస్తున్న విశ్వంభరలో మెగాస్టార్ స్రీన్ ప్రజెన్స్ తో పాటు గ్రాఫిక్స్, స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాయి. సినిమాను మరింత గ్రాండియర్ గా తీసుకురావాలని ఇప్పటికే ఫారెన్ గ్రాఫిక్స్ టీమ్ తో వర్క్ చేస్తున్నారు వశిష్ట అండ్ టీమ్.

మే 9న మెగాస్టార్ వచ్చినా రాకపోయినా ఆ డేట్ మీద ఖర్చీఫ్ వేసేసుకున్నారు రవితేజ. రవితేజ 75వ సినిమాగా తెరకెక్కుతున్న మాస్ జాతర మూవీని తన ఎనర్జిటిక్ ఫెర్మార్మెన్స్ తో మే 9న ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. మాస్ జతర సినిమాలో మరోసారి శ్రీలీలతో పెయిర్ అయ్యారు రవితేజ. మిస్టర్ బచ్చన్ తో ఫ్లాప్ లో ఉన్న రవితేజ భాను భోగవరపు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మాస్ జాతర సినిమాతో కం బ్యాక్ ఇస్తారని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Also Read : Anchor Suma : బళ్లారిలోని ఆ శివాలయంలో యాంకర్ సుమ ప్రత్యేక పూజలు..

నితిన్, లయ లీడ్ రోల్స్ లో ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న తమ్ముడు మూవీని సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే చెప్పడంతో మే థర్డ్ వీక్ లోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని ఆశిస్తున్నారు.

సమ్మర్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఎలా రన్ అయినా ఈ సాలిడ్ సమ్మర్ ని సూపర్ గా సెండాఫ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్నూనూరి డైరెక్షన్లో విజయ్ చేస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్ డమ్’ మూవీ మే 30న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అసలే 4, 5 ఏళ్ల నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ 100కోట్లభారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాతో గ్యారంటీగా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీడియో విజయ్ ని కొత్తగా చూపిస్తోంది. మరి ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ తో విజయ్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో అంటూ చర్చ మొదలైంది. ఇక వీటి మధ్యలో ప్రతి వారం ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ సారి సమ్మర్ థియేటర్ల నిండా సినిమాలతో కావల్సినంత ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యబోతోంది.