Anchor Suma : బళ్లారిలోని ఆ శివాలయంలో యాంకర్ సుమ ప్రత్యేక పూజలు..
తాజాగా యాంకర్ సుమ ఈ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది.

Anchor Suma special Pooja in Ballari Sri Amrutheshwara Temple
Anchor Suma : ఇటీవల శివరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు భక్తులు. సెలబ్రిటీలు కూడా ఆలయాలకు వెళ్లి పూజలు చేసారు. ఈ క్రమంలో యాంకర్ సుమ బళ్లారిలోని స్పెషల్ శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది. ప్రముఖ సినీ నిర్మాత, వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి గత సంవత్సరం అరుదైన కృష్ణ శిలలతో బళ్లారిలో కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా శ్రీ అమృతేశ్వర ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే.
గత సంవత్సరం మాఘమాసంలో ఈ శ్రీ అమృతేశ్వర ఆలయాన్ని ప్రారంభించారు. ఆ వేడుకలో రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, శ్రీవల్లి, యశ్, మంగ్లీ, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.
Also Read : Rambha : అప్పట్లో కుర్రాళ్ళ కలల రాణి.. ‘రంభ’.. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ
తాజాగా యాంకర్ సుమ ఈ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. శివలింగానికి అభిషేకం చేసింది. అనంతరం మాట్లాడుతూ.. అమృతేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేళ గర్భగుడిలో వేదవేత్తల మంత్రధ్వనుల మధ్య నేను స్వయంగా మహాస్పటికలింగానికి అభిషేకం చేసుకోవడం ఎంతో తన్మయత్వానికి గురిచేసిందని తెలిపింది. సుమతో పాటు పురాణపండ శ్రీనివాస్, నిర్మాత సాయి కొర్రపాటి పాల్గొన్నారు.
ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అడుగడుగునా అనుభూతిని కలిగిస్తున్న ఈ అమోఘమైన శ్రీ అమృతేశ్వర ఆలయ నిర్మాణ సమయంలో సాయి కొర్రపాటి ఎన్నో కష్టాలని అనుభవించి నిస్వార్ధ సేవగా ఈ ఆలయాన్ని నిర్మించారు. శివ భక్తుల పాలిట కల్పవృక్షమై తరాలపాటు చెప్పుకునేలా ఈ ఆలయం ఉంటుందని అన్నారు.
Also Read : DJ Tillu – Mad : డీజే టిల్లు – మ్యాడ్ యూనివర్స్ లను కలుపుతున్న డైరెక్టర్..? టిల్లు క్యూబ్ లో మ్యాడ్ బాయ్స్..
ఇక ఈ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఆలయ ఫౌండర్ ట్రస్టీలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి పర్యవేక్షణలో లక్షలాది భక్తుల మధ్య ఘనంగా జరిగాయి. కర్ణాటక, ఏపీకి చెందిన అనేకమంది సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. శంకర పీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ పర్యవేక్షణలో లింగోద్భవ కాలంలో శ్రీ అమృతేశ్వర మహా స్ఫటికలింగానికి వివిధ వైదిక ఉపచారాలతో అభిషేకార్చనలు జరిగాయి.