Sankranthiki Vasthunam : ఓటీటీలో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ హ‌వా.. హ‌నుమాన్‌, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్‌..

ఓటీటీలో సంక్రాంతికి వ‌స్తున్నాం రికార్డుల ప‌ర్వం మొద‌లైంది.

Sankranthiki Vasthunam : ఓటీటీలో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ హ‌వా.. హ‌నుమాన్‌, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్‌..

SankranthikiVasthunam OTT storm BEGIN shattering all previous records on Zee5

Updated On : March 2, 2025 / 4:47 PM IST

విక్టరీ వెంక‌టేష్ న‌టించిన మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.300 కోట్ల పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ క్ర‌మంలో విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

దాదాపు 100 థియేటర్లలో 50 రోజుల రన్‌ను పూర్తి చేసుకుని ప్రాంతీయ చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. థియేట‌ర్ల‌లో క‌డుపుబ్బా న‌వ్వించిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు.

Mad Square : ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా.. ‘మ్యాడ్ స్క్వేర్’.. అమావాస్య వచ్చిందని ఒక రోజు ముందు రిలీజ్..

వారి ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఓటీటీలో శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అదే స‌మ‌యంలో జీ తెలుగు టీవీ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌యింది. ఇలా ఒకేసారి ఓటీటీతో పాటు టీవీల్లోనూ ఓ చిత్రం రావ‌డం ఇదే తొలిసారి.

ఇదిలా ఉంటే ఈ చిత్రం జీ5 ఓటీటీలో స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్‌, హ‌నుమాన్ రికార్డుల‌ను బ్రేక్ చేసింది. కేవ‌లం 12 గంట‌ల్లో 100 ఫ్ల‌స్ మిలియన్ నిమిషాల స్ట్రీమింగ్ న‌మోదు కాగా.. 1.3 మిలియ‌న్ల‌కు పైగా వ్యూయ‌ర్స్ ఈ చిత్రాన్ని వీక్షించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Senior Heroins : వామ్మో.. సీనియర్ హీరోయిన్స్ మాస్ డ్యాన్స్ తో రీల్.. మీనా, సంగీత, మహేశ్వరి వైరల్..

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి లు క‌థానాయిక‌లుగా న‌టించారు. ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ, నరేష్, వీటీవీ గణేష్, పృథ్వీ రాజ్, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస రెడ్డి, మురళీ ధర్ గౌడ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.