karnataka mla pradeep eshwar donates blood at chiranjeevi blood bank
మెగాస్టార్ చిరంజీవిని కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కలిశారు. మెగాస్టార్‌ను కలుసుకునే ముందే చిక్ బళ్ళాపూర్ శాసన సభ్యులు ప్రదీప్ ఈశ్వర్.. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన బంధువు రమేష్ బాబు రక్తదానం చేశారు.
అనంతరం వారు ఇరువురు చిరు నివాసంలో చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. రక్తదానం చేసినందుకు ఎమ్మెల్యేతో పాటు రమేష్‌ను చిరంజీవి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
Jani Master : జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టులో చుక్కెదురు..
ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరు ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. దసరా సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.