వదినతో కార్తీ కొత్త సినిమా

తొలిసారి కలిసి నటిస్తున్న భార్య, తమ్ముడికి శుభాకాంక్షలు చెప్పాడు సూర్య. వదినతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని కార్తీ అన్నాడు..

  • Published By: sekhar ,Published On : April 27, 2019 / 08:12 AM IST
వదినతో కార్తీ కొత్త సినిమా

Updated On : April 27, 2019 / 8:12 AM IST

తొలిసారి కలిసి నటిస్తున్న భార్య, తమ్ముడికి శుభాకాంక్షలు చెప్పాడు సూర్య. వదినతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని కార్తీ అన్నాడు..

తమిళ యంగ్ హీరో కార్తీ, తన కెరీర్‌లో మొట్టమొదటి సారిగా వదిన జ్యోతికతో కలిసి నటించబోతున్నాడు. ప్రముఖ మలయాళీ దర్శకుడు, దృశ్యం ఫేమ్.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో, వయాకామ్ 18 స్టూడియోస్ సమర్పణలో, పారాలాల్ మైండ్స్ ప్రొడక్షన్స్‌లో ఓ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈరోజు (ఏప్రిల్ 27) షూటింగ్ స్టార్ట్ అయ్యింది. గోవాలో షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సూర్య, జ్యోతిక, సత్యరాజ్, ఆన్సన్ పాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి, 96 ఫేమ్, గోవింద వసంత మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

2019 అక్టోబర్‌లో రిలీజ్ చెయ్యనున్నారు. కార్తీ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో ఖైదీ, రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తొలిసారి కలిసి నటిస్తున్న భార్య, తమ్ముడికి శుభాకాంక్షలు చెప్పాడు సూర్య. వదినతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని కార్తీ అన్నాడు.