Karthi Vaa Vaathiyaar movie releasing for Sankranthi festival season.
Vaa Vaathiyaar Update: తమిళ స్టార్ కార్తీ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్’. సరికొత్త కథ, కథానాలంతో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. దీంతో, వా వాతియార్(Vaa Vaathiyaar Update) సినిమా కోసం కార్తీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు.
ముందు ప్లాన్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడాల్సి వచ్చింది. తరువాత డిసెంబర్ 25న కూడా విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. కానీ, ఆ సమయంలో తెలుగులో 4 సినిమాలు విడుదల అయ్యాయి. అందుకే, ఆ డేట్ నుంచి కూడా వాయిదా పడింది. సంక్రాంతికి వద్దాం అనుకుంటే విజయ్ నటించిన జన నాయగన్ జనవరి 9న వస్తుంది అని తప్పుకున్నారు.
MSVG Success Celebrations: చిరు ఇంట్లో మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు
కానీ, ఇప్పుడు జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడటంతో వా వాతియార్ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈమేరకు అధికారిక చేసేశారు. జనవరి 14న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో, కార్తీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమా జనవరి 14న విడుదల అవుతున్నట్టుగా చాలా మందికి తెలియదు. ఆ విషయం కొంచం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
తమిళంలో ఒకే కానీ, తెలుగులో సంక్రాంతి బరిలో ఏకంగా 5 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, తెలుగులో వా వాతియార్ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ ఉండకపోవచ్చు అని టాక్ నడుస్తోంది. మినిమమ్ ప్రచారం కూడా చేయకుండా ఇలా సడన్ ఎంట్రీ అంటే అది ఆడియన్స్ వరకు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆ అడ్డంకిని మేకర్స్ ఎలా ఓవర్కం చేస్తారు అనేది చూడాలి. ఇక వా వాతియార్ సినిమాను తెలుగు అన్నగారు వస్తారు అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.