డిసెంబర్ 20న ‘దొంగ’ విడుదల

రియల్ లైఫ్ వదిన, మరిది.. జ్యోతిక, కార్తీ అక్కాతమ్ముళ్లుగా నటిస్తున్న సినిమా.. ‘తంబి’.. తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల కానుంది. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘దృశ్యం’ ఫేమ్.. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
వయాకామ్ 18 స్టూడియోస్ సమర్పణలో, పారాలాల్ మైండ్స్ ప్రొడక్షన్స్లో రూపొందిన ఈ సినిమా తెలుగు టీజర్ ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
డిసెంబర్ 20న ‘దొంగ’ రిలీజ్ కానుందని తెలుగులో విడుదల చేస్తున్న హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ తెలిపారు. షావుకారు జానకి, సత్యరాజ్, నికిలా విమల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: గోవింద్ వసంత, దర్శకత్వం: జీతు జోసెఫ్.