Bhool Bhulaiyaa 2 : ఆ హిట్ సినిమాకు మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన కార్తీక్ ఆర్యన్.. హిట్ కోసమేనా??
కార్తీక ఆర్యన్ నుంచి భూల్ భూలయ్య 2 తర్వాత వచ్చిన ఫ్రెడ్డీ, షెహజాదా సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇటీవల పఠాన్ సక్సెస్ తర్వాత వచ్చిన పలు బాలీవుడ్ సినిమాలు కూడా పరాజయం అయిన సంగతి తెలిసిందే. దీంతో కార్తీక్ ఆర్యన్ కు మరో హిట్ కావాలని తాజాగా.................

kartik aaryan announce sequel for Bhool Bhulaiyaa 2 movie
Bhool Bhulaiyaa 2 : బాలీవుడ్ గత సంవత్సర కాలంగా వరుస పరాజయాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రెండు, మూడు హిట్స్ అందుకుంది బాలీవుడ్. అందులో భూల్ భూలయ్య 2 ఒకటి. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా టబు ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. గత సంవత్సరం మేలో రిలీజ్ అయినా భూల్ భూలయ్య 2 సినిమాని 70 కోట్లతో తెరకెక్కించగా దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తెచ్చింది. ఈ సినిమా విజయం పై కార్తీక్ ఆర్యన్, అభిమానులు, బాలీవుడ్ సంతోషం వ్యక్తం చేసింది.
కార్తీక ఆర్యన్ నుంచి భూల్ భూలయ్య 2 తర్వాత వచ్చిన ఫ్రెడ్డీ, షెహజాదా సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇటీవల పఠాన్ సక్సెస్ తర్వాత వచ్చిన పలు బాలీవుడ్ సినిమాలు కూడా పరాజయం అయిన సంగతి తెలిసిందే. దీంతో కార్తీక్ ఆర్యన్ కు మరో హిట్ కావాలని తాజాగా భూల్ భూలయ్య 3 సినిమాని అనౌన్స్ చేశారు. భూల్ భూలయ్య 2కి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది.
Sudheer Babu : సుధీర్ బాబు కెరీర్‌లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నాడా?
భూల్ భూలయ్య 2 సినిమా తెరకెక్కించిన అనీస్ బజ్మీనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. భూల్ భూలయ్య 3 సినిమాని 2024 దీపావళికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ గ్యాప్ లో కార్తీక్ ఆర్యన్ మరో సినిమా చేస్తున్నాడు. హిట్ కోసం బాలీవుడ్ హీరోలు సీక్వెల్స్, రీమేక్స్ ఇంకా నమ్ముకుంటూనే ఉన్నారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
BIGGG NEWS… KARTIK AARYAN – ANEES BAZMEE – BHUSHAN KUMAR REUNITE FOR ‘BHOOL BHULAIYAA 3’… The third installment of the much-anticipated horror-comedy #BhoolBhulaiyaa3 will release in #Diwali 2024.#BhushanKumar #AneesBazmee #KartikAaryan pic.twitter.com/4ZssPwebkc
— taran adarsh (@taran_adarsh) March 1, 2023