Bollywood Star Hero : రిలీజ్ రోజే టికెట్ కొంటే టికెట్ ఆఫర్.. కారణం అదేనా?

బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన తాజా చిత్రం 'షెహజాదా'. నేడు (ఫిబ్రవరి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ రోజే ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. బుక్ మై షోలో షెహజాదా సినిమాకి ఒక టికెట్ కొంటే...

Bollywood Star Hero

Bollywood Star Hero : బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘షెహజాదా’. ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అలవైకుంఠపురంలో సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీని బాలీవుడ్ ప్రొడ్యూసర్ లతో పాటు తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధా కృష్ణ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చితం.. నేడు (ఫిబ్రవరి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ రోజే ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్.

Shehzada: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బంటు.. భలే ఉన్నాడుగా!

బుక్ మై షోలో షెహజాదా సినిమాకి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అంటూ ప్రకటించారు. అదేంటి అలవైకుంఠపురంలో లాంటి హిట్ సినిమా రీమేక్, పైగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమా.. అయినా మొదటి రోజే ఇలాంటి ఆఫర్ ఏంటని అనుకుంటున్నారా? ఇటీవలే తెలుగు అలవైకుంఠపురంలో సినిమాని యూట్యూబ్ లో డబ్ చేసి రిలీజ్ చేశారు. దీంతో చాలా మంది ఆ సినిమాని యూట్యూబ్ లో చూసేశారు. మరో వైపు షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా టికెట్ రేట్లు కూడా ఈ వారం నుంచి తగ్గించి ప్రేక్షకులకు ఆఫర్ ఇచ్చారు.

అలవైకుంఠపురంలో యూట్యూబ్ రిలీజ్, పఠాన్ టికెట్ రేట్ తగ్గింపుతో.. ‘షెహజాదా’ కలెక్షన్స్ కి ఇబ్బంది కలగనుంది. దీంతో మేకర్స్ చేసేది లేక ఆడియన్స్ ని రప్పించేందుకు ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఒక స్టార్ హీరో సినిమాకి మొదటి రోజే ఇటివంటి ఆఫర్ పెట్టడం ఏంటని అభిమానులు, బాలీవుడ్ ప్రేక్షకులు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సినిమా టాక్ కూడా మిక్స్డ్ గా ఉంది. మరి ఇన్ని ఇబ్బందులు మధ్య ఈ మూవీ పెట్టిన బడ్జెట్ ని అయినా రాబట్టకాగలదా? లేదా? చూడాలి.