ఒక్కరోజు మందు తాగకపోతే చచ్చిపోతావా? : 90 ఎంఎల్ – ట్రైలర్

కార్తికేయ, నేహా సోలంకి జంటగా.. శేఖర్ రెడ్డి ఎర్రని దర్శకుడిగా పరిచయం చేస్తూ, అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న సినిమా ‘90 ఎంఎల్’ (Un Authorized Drinker) థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : November 21, 2019 / 05:58 AM IST
ఒక్కరోజు మందు తాగకపోతే చచ్చిపోతావా? : 90 ఎంఎల్ – ట్రైలర్

Updated On : November 21, 2019 / 5:58 AM IST

కార్తికేయ, నేహా సోలంకి జంటగా.. శేఖర్ రెడ్డి ఎర్రని దర్శకుడిగా పరిచయం చేస్తూ, అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న సినిమా ‘90 ఎంఎల్’ (Un Authorized Drinker) థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

కార్తికేయ, నేహా సోలంకి జంటగా.. శేఖర్ రెడ్డి ఎర్రని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సరస్వతి శుక్లా సమర్పణలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న సినిమా ‘90 ఎంఎల్’ (Un Authorized Drinker).. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గురువారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

‘నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది, నాతో కలిసి బతకాలన్న ఆలోచనే నీలో లేదు.. ఐ హేట్ యూ’ అని హీరోయిన్, హీరోతో చెప్పే డైలాగుతో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మూడు పూటలూ మూడు 90 ఎంఎల్స్ తాగకపోతే బతకలేని హీరో, మందంటే అసహ్యించుకునే హీరోయిన్‌ని లవ్ చేయడం, హీరో అలవాటు తెలిసి హీరోయిన్ ఫాదర్ రిజెక్ట్ చేయడం, తన మందు తాగి తననే కొట్టాడని విలన్, హీరో కోసం వెతకడం.. ఓవరాల్‌గా ‘90 ఎంఎల్’ కథ ఏంటనేది ట్రైలర్‌లో చూపించారు.

Read Also : పది భాషల్లో ప్రతిష్టాత్మకంగా ‘‘RRR’’

రవికిషన్, రావు రమేష్, ఆలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్, ‘కాలకేయ’ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూరు సుదర్శన్, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే వైవిధ్యంగా ఉంటుంది. అలాగే కమర్షియల్‌అంశాలతో వినోదాత్మకంగా ఉంటుంది అని మేకర్స్ చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిశెంబర్ 5న విడుదల చేయనున్నారు. సంగీతం : అనూప్ రూబెన్స్, లిరిక్స్ : చంద్రబోస్, కెమెరా : జె.యువరాజ్, ఎడిటింగ్ : ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్ : వెంకట్.