Kauvery Hospital Releases A Medical Bulletin
Rajinikanth Health : తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల అయింది. రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. మెదడు, రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. త్వరలోనే రజినీని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని కావేరి ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అనారోగ్య సమస్యతో రజనీ (అక్టోబర్ 28)న చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శుక్రవారం (అక్టోబర్ 29)న రజినీకాంత్ కు కరోటిడ్ ఆర్టిడ్ రివాస్కులరైజేషన్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
ఒక్కసారిగా తలైవా ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రజినీ ఆరోగ్యం పై సోషల్ మీడియాలో రుమర్లు కూడా చక్కర్లు కొట్టాయి. రజినీ ఆరోగ్యంపై ఆయన భార్య లత స్పందించారు. నెట్టింట్లో రజినీ కాంత్ ఆరోగ్యంపై వదంతులను నమ్మవద్దని ఆమె చెప్పారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు.
Read Also : Rajinikanth : రజినీకాంత్‌కు స్వల్ప అస్వస్థత..!
రజినీకి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రజినీకి సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని లత స్పష్టం చేశారు. ఇప్పటికే రజనీ హీరోగా నటించిన పెద్దన్న సినిమా షూటింగ్ పూర్తి అయింది. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.