Kavin Aparna Das Da Da Movie Releasing in Telugu with Pa Pa Title
PaPa : కవిన్, అపర్ణా దాస్ జంటగా తెరకెక్కిన తమిళ సినిమా ‘డాడా’. 2023 లో తమిళ్ లో చిన్న సినిమాగా రిలీజయి పెద్ద హిట్ అయింది. భాగ్యరాజ్, ఐశ్వర్య భాస్కరన్, విటివి గణేష్.. పలువురు ముఖ్య పాత్రల్లో గణేష్ కె. బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ‘పాపా’ అనే టైటిల్ తో రిలీజ్ కాబోతుంది.
జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ అవ్వనుంది.
తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేసారు. మీరు కూడా పాపా ట్రైలర్ చూసేయండి..
పాపా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సీనియర్ డైరెక్టర్స్ ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ లు గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడే పాపా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని అన్నారు. దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ.. డాడా సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో పాపా పేరుతో రిలీజ్ అయి మంచి విజయం సాధిస్తుంది అని తెలిపారు.
Also Read : Akkineni Family : అఖిల్ రిసెప్షన్.. ‘అక్కినేని ఫ్యామిలీ’ ఫుల్ ఫోటో వైరల్.. ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..
నిర్మాత నీరజ కోట మాట్లాడుతూ.. మా జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మొదట చేస్తున్న సినిమా పాపా. ఈ సినిమా తమిళ్ లో డాడా పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అలాంటి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.