Akkineni Family : అఖిల్ రిసెప్షన్.. ‘అక్కినేని ఫ్యామిలీ’ ఫుల్ ఫోటో వైరల్.. ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..
అఖిల్ రిసెప్షన్ కి అక్కినేని ఫ్యామిలీ అంతా హాజరైంది. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఒక స్పెషల్ గ్రూప్ ఫోటో కూడా దిగారు.

Akkineni Family Full Photo goes Viral from Akhil Wedding Reception
Akkineni Family : నాగార్జున రెండో తనయుడు, హీరో అక్కినేని అఖిల్ పెళ్లి ఇటీవల తన ప్రియురాలు జైనబ్ రవ్జీ తో జూన్ 6న జరిగింది. వీరి రిసెప్షన్ జూన్ 8న జరిగింది. పెళ్ళికి సన్నిహితులు, కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే రాగా రిసెప్షన్ కి మాత్రం సినిమా, రాజకీయ, వ్యాపార రంగాల్లోని అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో అఖిల్ – జైనబ్ రిసెప్షన్ ఫొటోలు వైరల్ గా మారాయి.
అయితే అఖిల్ రిసెప్షన్ కి అక్కినేని ఫ్యామిలీ అంతా హాజరైంది. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఒక స్పెషల్ గ్రూప్ ఫోటో కూడా దిగారు. ఈ అక్కినేని ఫ్యామిలీ గ్రూప్ ఫోటో వైరల్ గా మారింది. పలువురు అక్కినేని కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ ఈ ఫోటోని షేర్ చేసి మరింత వైరల్ చేస్తున్నారు.
ఈ ఫొటోలో అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, జైనబ్, నాగచైతన్య, శోభిత.. అక్కినేని నాగార్జున అన్నయ్య వెంకట్, వెంకట్ భార్య, వెంకట్ పిల్లలు, నాగార్జున చెల్లి నాగ సుశీల, నాగ సుశీల కొడుకు, హీరో సుశాంత్, హీరో సుమంత్, సుమంత్ చెల్లి సుప్రియ యార్లగడ్డ, సుమంత్ తండ్రి సురేంద్ర యార్లగడ్డ.. పలువురు అఖిల్ కజిన్స్ ఉన్నారు. ఇంతమంది అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ ఒకే ఫొటోలో చూడటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.