Trivikram – NTR – Allu Arjun : త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్న అల్లు అర్జున్.. కార్తికేయుడిగా ఎన్టీఆర్.. నాగవంశీ ట్వీట్ తో క్లారిటీ..

గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ మైథాలజీ సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

Trivikram – NTR – Allu Arjun : త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్న అల్లు అర్జున్.. కార్తికేయుడిగా ఎన్టీఆర్.. నాగవంశీ ట్వీట్ తో క్లారిటీ..

Jr NTR Replace with Allu Arjun in Trivikram Mythology Movie

Updated On : June 11, 2025 / 1:33 PM IST

Trivikram – NTR – Allu Arjun : పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారని అధికారికంగానే ప్రకటించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కథతో మైథాలజీ సినిమా చేయబోతున్నారని, అల్లు అర్జున్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతున్నాడని హింట్స్ కూడా ఇచ్చేసారు. కానీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా పక్కన పెట్టి అట్లీ సినిమా మొదలుపెట్టాడు. అయితే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా తర్వాత ఉంటుందేమో అని ఇన్ని రోజులు అనుకున్నారు.

గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ మైథాలజీ సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ తో క్లారిటీ వచ్చేసింది. నిర్మాత నాగవంశీ కార్తికేయ స్వామికి సంబంధించిన రెండు శ్లోకాలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా ఫేవరేట్ అన్న మోస్ట్ పవర్ ఫుల్ గాడ్ గా కనిపించబోతున్నాడు అని ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : AA22xA6 : రేప‌టి నుంచే అల్లు అర్జున్‌, అట్లీల మూవీ షూటింగ్.. దీపికాతో పాటు ఆ హీరోయిన్ కూడా..

నాగవంశీ ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ అని అందరికి తెలిసిందే. ఈ విషయం నాగవంశీ కూడా అనేకమార్లు తెలిపాడు. ఇక కార్తికేయ స్వామి శ్లోకాలు షేర్ చేయడంతో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమానే ఇప్పుడు ఎన్టీఆర్ చేయబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది అంటున్నారు. దీనిపై బన్నీ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరి బన్నీ తనకు మూడు హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడో అని ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారింది. ఇక ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతున్నాడు అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ – నీల్ సినిమా అయ్యాక ఈ సినిమా షూట్ మొదలుపెడతారని సమాచారం.

 

Also Read : Singer Mangli : సింగ‌ర్ మంగ్లీ బ‌ర్త్‌డే పార్టీలో గంజాయి క‌ల‌క‌లం..