AA22xA6 : రేప‌టి నుంచే అల్లు అర్జున్‌, అట్లీల మూవీ షూటింగ్.. దీపికాతో పాటు ఆ హీరోయిన్ కూడా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌నే విష‌యం తెలిసిందే

AA22xA6 : రేప‌టి నుంచే అల్లు అర్జున్‌, అట్లీల మూవీ షూటింగ్.. దీపికాతో పాటు ఆ హీరోయిన్ కూడా..

Allu Arjun Atlee AA22xA6 movie shooting starts tomorrow

Updated On : June 11, 2025 / 12:53 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌నే విష‌యం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. కాగా.. రేప‌టి నుంచి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

తొలి షెడ్యూల్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌క్కిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ముంబైలో చిత్రీక‌రించ‌నున్న ఈ స‌న్నివేశాలు సినిమాకు ఎంతో కీలకంగా కానున్న‌ట్లు స‌మాచారం. స్టారో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సైతం ఈ షెడ్యూల్‌లో భాగం కానున్న‌ట్లు తెలుస్తోంది. AA26xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Kuberaa : కుబేర నుంచి ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ సాంగ్ వ‌చ్చేసింది..

ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్లుగానే హాలీవుడ్ లెవెల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు 700 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతున్న‌ట్లుగా టాక్‌.