Keedaa Cola : కీడాకోలా నుంచి మాస్ లిరికల్ బీట్.. ‘కయ్యాల చిందాట’
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో యూత్ అందర్నీ అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.

Kayyaala Chindhaata lyrical
Keedaa Cola second single : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో యూత్ అందర్నీ అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తాజాగా ఆయన డైరెక్షన్‌లో వస్తున్న మూడో సినిమా ‘కీడా కోలా’. ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ సాగే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఓ కీలక పాత్రని పోషించారు. కీడా అంటే బొద్దింక అని అర్ధం. ’30 వెడ్స్ 21′ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ లు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shankar Dada MBBS : ముందుంది ‘శంకర్ దాదా’ రీ రిలీజ్ పండుగ.. కొత్త ట్రైలర్ చూశారా..?
ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రెండో సింగిల్ ను విడుదల చేసింది. కయ్యాల చిందాట అంటూ ఈ పాట సాగుతోంది. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. నిక్లేష్ సుంకోజీ అందించిన లిరిక్స్ అందించగా హేమచంద్ర, వివేక్ సాగర్ పాడారు. వీజీ సైన్మా సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.