RRR gets Golden Globe Award : కీరవాణికి వెల్లువెత్తుతున్న అభినందనలు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేదికపై కీరవాణి ఏం మాట్లాడాడో తెలుసా??

అత్యంత ప్రతిష్టాత్మిక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న కీరవాణి ఈ వేదికపై మాట్లాడుతూ.. ఈ అవార్డు నాకు అందించిన HFPA కి (హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్) ధన్యవాదాలు. ముందుగా నా భార్యకి............

Keeravani Speech in Golden Golbe Awards stage

RRR gets Golden Globe Award :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ సినిమా RRR భారీ విజయం సాధించి ఇండియాతో పాటు విదేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి అంతర్జాతీయవేదికగా అవార్డులు వరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఇటీవల RRR నామినేట్ అవ్వగా తాజాగా ఈ అవార్డ్స్ ని ప్రకటించారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డుని అంతర్జాతీయ వేదికపై అందుకున్నారు. దీంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులు, సినీ ప్రియులు కీరవాణికి, RRR చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా నెటిజన్లు, అభిమానులు పలువురు ప్రముఖులు కీరవాణికి అభినందనలు తెలుపుతున్నారు.

గతంలో ఇండియా నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన వ్యక్తి సంగీత దర్శకుడు AR రెహమాన్ కీరవాణిని ట్విట్టర్ వేదికగా అభినందించారు. నమ్మశక్యం కానీ ఓ కొత్త నమూనాని సృష్టించారు, కీరవాణి, రాజమౌళి, RRR టీం అందరికి దేశం తరపున అభినందనలు అని ట్వీట్ చేశారు రెహమాన్. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా..ఎంతో అపూర్వమైన చారిత్మతిక విజయం. కీరవాణికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. టీం అందరికి అభినందనలు. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తుంది అని అన్నారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, రామ్ చరణ్.. ఇంకా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కీరవాణికి, RRR టీం కి అభినందనలు తెలుపుతున్నారు.

Golden Globe Award to RRR : మరో భారీ అవార్డు సొంతం చేసుకున్న RRR… ‘నాటు నాటు’ సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు..

ఇక అత్యంత ప్రతిష్టాత్మిక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న కీరవాణి ఈ వేదికపై మాట్లాడుతూ.. ఈ అవార్డు నాకు అందించిన HFPA కి (హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్) ధన్యవాదాలు. ముందుగా నా భార్యకి థ్యాంక్ చెప్పాలి, నాకు ప్రతి విషయంలో తోడున్నందుకు. ఇక ఈ అవార్డు రావడానికి కారణమైన మరికొందరికి థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ నా బ్రదర్ రాజమౌళి కి, అనంతరం ఈ పాటకి అద్భుతమైన డ్యాన్స్ సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి, సాహిత్యం అందించిన చంద్రబోస్ గారికి, ఈ పాట పడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకి, అద్భుతంగా డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కి అలాగే ఈ సాంగ్ కి ప్రోగ్రామింగ్ చేసిన సాలు సిద్దార్థ్, జీవన్ బాబులకి అలాగే శ్రీవల్లికి అందరికి ధన్యవాదాలు అని అన్నారు.