Keerthy Suresh : ‘జవాన్’ సాంగ్‌కి కీర్తిసురేశ్ వేసిన డ్యాన్స్ చూశారా..?
కీర్తి సురేష్, జవాన్ దర్శకుడు అట్లీ సతీమణి ప్రియ మంచి స్నేహితులు. తాజాగా వీరిద్దరూ..
- gum 95921
- Published On : September 13, 2023 / 09:12 PM IST
Keerthy Suresh Atlee wife priya dance for Jawan song chaleya
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్, తమిళ దర్శకుడు అట్లీ (Atlee) సతీమణి ప్రియ మంచి స్నేహితులు. దీంతో అట్లీతో కూడా కీర్తికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఇక తాజాగా అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ (Jawan) రిలీజ్ సమయంలో కూడా అట్లీకి అల్ ది బెస్ట్ చెబుతూ లైటింగ్ సెట్ తో ఒక స్పెషల్ పోస్ట్ వేసింది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో.. తాజాగా ఆ మూవీలోని ఒక పాటకు డాన్స్ వేసి అదరగొట్టింది.
Mahesh Babu : మహేష్ బాబు ఫ్యామిలీ.. స్కాట్లాండ్ అడ్వెంచర్స్.. వీడియో వైరల్!
మూవీలోని ‘చెలియా’ సాంగ్ కి షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) వేసిన స్టెప్పులను.. అట్లీ వైఫ్ ప్రియతో కలిసి వేసి అదరగొట్టింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఫిదా అయ్యిపోయి లైక్స్ కొడుతున్నారు. మరి ఆ చెలియా సాంగ్ కి ఈ చెలి ఎలా వేసిందో చూసేయండి.
Kitty @KeerthyOfficial and @priyaatlee dancing #Chaleya song ❤️?@Atlee_dir #Jawan #KeerthySuresh pic.twitter.com/fLcmE4tzDB
— Trends Keerthy (@TrendsKeerthy) September 13, 2023
కాగా జవాన్ మూవీ మొదటి నాలుగు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కానీ ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రెజెంట్ ఈ మూవీ 600 కోట్ల మార్క్ ని అందుకుంది. షారుఖ్ ఈ సినిమాతో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు. మరి బాద్‌షా నెరవేరుతుందా? లేదా? చూడాలి.
Chandramukhi 2 : చంద్రముఖి నుంచి ‘థోరి బోరి’ లిరికల్ సాంగ్ రిలీజ్..
ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ఇటీవల భోళాశంకర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కనిపించింది. అయితే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగులో మరే కొత్త మూవీ చేయడం లేదు. ఒక తమిళంలోనే మొత్తం నాలుగు సినిమాల్లో నటిస్తుంది. ఈ నాలుగు చిత్రాలు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలే.
