Keerthy Suresh : 21 ఏళ్ల వ‌య‌సులో బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో మ‌ర‌ణం.. కీర్తి సురేష్‌ ఎమోష‌న‌ల్ పోస్ట్

గ‌త నెల‌రోజులుగా త‌న‌కు క‌ష్టంగా ఉందంటూ కీర్తి ఎమోష‌న‌ల్ అవుతోంది.

keerthy suresh

నేను శైల‌జ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిన్న‌ది కీర్తి సురేష్‌. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మ‌హాన‌టితో కీర్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న సినిమాలు, వ్యక్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యాల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే.. గ‌త నెల‌రోజులుగా త‌న‌కు క‌ష్టంగా ఉందంటూ కీర్తి ఎమోష‌న‌ల్ అవుతోంది. ఇంకా జీవితాన్ని చూడ‌లేద‌ని, ఎన్నో క‌ల‌లు ఉన్నాయని, దేవుడు ఇలా చేస్తాడ‌ని అనుకోలేద‌ని చెబుతూ బాధ‌ప‌డుతోంది.

ఇటీవ‌ల కీర్తి సురేష్ స్నేహితురాలు చ‌నిపోయింది. స్నేహితురాలు మ‌ర‌ణించిన విష‌యాన్ని కీర్తి ఇంకా జీర్ణించుకోలేక‌పోతుంది. ఈ క్ర‌మంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. గ‌త కొన్నివారాలుగా త‌న‌కు చాలా బాధ‌గా, మ‌న‌సుకు ఎంతో క‌ష్టంగా ఉన్న‌ట్లు కీర్తి తెలిపింది. త‌న చిన్న‌నాటి స్నేహితురాలు ఇంత త్వ‌ర‌గా అంద‌రిని విడిచిపెట్టి వెళ్ల‌డం త‌న‌కు న‌మ్మ‌శ‌క్యంగా లేదంది. 21 ఏళ్ల వయసులో తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె.. దాదాపు 8 ఏళ్లు దానిపై పోరాటం చేసిన‌ట్లుగా గుర్తు చేసుకుంది.

Rajamouli : రాజమౌళి చిన్నప్పుడు కృష్ణుడిగా ఓ సినిమాలో నటించాడని తెలుసా? ఏ సినిమా అంటే..

గత నవంబర్‌లో మూడో స‌ర్జ‌రీ చేయించుకునే వ‌ర‌కు అలాంటి సంకల్ప శక్తి ఉన్నవారిని తాను ఇంత వ‌ర‌కు చూడలేదంది. ఆమెను చివ‌రి సారి క‌లిసిన‌ప్పుడు నొప్పిని భ‌రించ‌లేక‌పోతున్నాన‌ని చెప్పి ఏడ్చింద‌ని తెలిపింది.

‘ఆ స‌మ‌యంలో నా భావోద్వేగాలు ఆమెకు క‌నిపించ‌నీయ‌లేదు. అయితే.. బ‌య‌ట‌కు వ‌చ్చిన నిమిషంలో అద్దాలు, మాస్క్ పెట్టుకుని ఆస్ప‌త్రి కారిడార్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లాను. ఇక ఆమె అప‌స్మార‌క స్థితిలో ఉన్న‌ప్పుడు మళ్లీ చూశాను. ఆ విషయాన్ని నేను ప్రస్తావించదలచుకోలేదు. తన జీవితాన్ని కూడా ప్రారంభించని, ప్రపంచాన్ని కూడా చూడని, నెరవేర్చుకోలేని ఎన్నో కలలు కన్న ఇంత చిన్న అమ్మాయికి ఇలా ఎందుకు జరిగింది అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. నా దగ్గర ఇంకా సమాధానం లేదు. ఆమె తన చివరి శ్వాస వరకు పోరాడింది. మీరు సరిగ్గా నెల రోజుల క్రితం వెళ్లిపోయారు. నీ గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవదు మచ్చుత్తా. ఈ రోజు మీ పుట్టినరోజున, ఎప్పటికీ మిమ్మల్ని స్మరించుకుంటున్నాను. ‘అని కీర్తి సురేశ్ ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసింది.

Sana Makbul : హిందీ బిగ్‌బాస్ విన్నర్.. తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేసిందని తెలుసా?

ట్రెండింగ్ వార్తలు