Sana Makbul : హిందీ బిగ్‌బాస్ విన్నర్.. తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేసిందని తెలుసా?

హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజ‌న్ 3 విజేత‌గా న‌టి స‌నా మక్బుల్ గెలిచింది.

Sana Makbul : హిందీ బిగ్‌బాస్ విన్నర్.. తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేసిందని తెలుసా?

Hindi Bigg Boss OTT Season 3 Winner Sana Makbul Acted in Telugu Movies

Updated On : August 3, 2024 / 2:36 PM IST

Sana Makbul : హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజ‌న్ 3 తాజాగా పూర్తయింది. ఈ సీజన్ లో విజేత‌గా న‌టి స‌నా మక్బుల్ గెలిచింది. ర్యాప్ సింగ‌ర్ నేజీ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన స‌నా మ‌క్బుల్‌ బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 25 ల‌క్ష‌ల రూపాయలు గెలుచుకుంది. సనా మక్బుల్ బాలీవుడ్ లో సీరియల్ నటిగా, పలు టీవీ షోలతో, సోషల్ మీడియాతో బాగా పాపులర్ తెచ్చుకుంది.

Also Read : Nagababu : మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. వాళ్ళ కోసం సాయం..

స‌నా మక్బుల్ పలు సినిమాల్లో కూడా నటించింది. 2014లో తెలుగులో ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాతో స‌నా మక్బుల్ హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నాగశౌర్య హీరో. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత తమిళ్ లో ఒక సినిమా చేసి అనంతరం తెలుగులో మామ ఓ చందమామ అనే మరో సినిమా కూడా చేసింది స‌నా మక్బుల్.

Hindi Bigg Boss OTT Season 3 Winner Sana Makbul Acted in Telugu Movies

అయితే ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్లి టీవీ షోలతో బిజీ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 విన్నర్ గా నిలిచి స‌నా మక్బుల్ పాపులర్ అవుతుంది. మరి ఇప్పుడైనా మళ్ళీ హీరోయిన్ గా అవకాశాలు వస్తాయేమో చూడాలి ఈ అమ్మడికి.

Hindi Bigg Boss OTT Season 3 Winner Sana Makbul Acted in Telugu Movies