×
Ad

Keerthy Suresh: కీర్తి సురేష్ కి బంపర్ ఆఫర్.. చాలా గ్యాప్ తరువాత తెలుగులో సినిమా.. కనీసం ఇప్పుడైనా..

కొన్నిసార్లు విజయం కూడా మనిషిని కిందకు నెట్టేస్తుంది. స్టార్(Keerthy Suresh) బ్యూటీ కీర్తి సురేష్ కి ఇదే జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి సినిమా తరువాత ఆమెకు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు.

Keerthy Suresh selected as heroine in Vijay Deverakonda's Rowdy Janardhana

Keerthy Suresh: కొన్నిసార్లు విజయం కూడా మనిషిని కిందకు నెట్టేస్తుంది. స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ కి ఇదే జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి సినిమా తరువాత ఆమెకు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు. ఎందుకంటే, మహానటి పాత్ర తరువాత ఆమెను వేరే పాత్రలో చూడలేకపోయారు ఆడియన్స్. తెలుగులో ఆమె నేను శైలజ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, మహేష్ బాబు తో(Keerthy Suresh) సర్కారువారి పాట, నేను లోకల్, దసరా లాంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలో దసరా సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. కానీ, ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా చేసిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

Catherine Tresa: కేక పెట్టిస్తున్న కేథరిన్.. వైట్ డ్రెస్ లో హాట్ పోజులు..

ఇక ఆ తరువాత నుంచి తెలుసు సినిమాలకు దూరం అయ్యింది కీర్తి సురేష్. బాలీవుడ్, కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తోంది. కానీ, తెలుగు ఫ్యాన్స్ మాత్రం ఆమె కంబ్యాక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాలో కూడా ఆమెకు అవకాశం దక్కలేదు. తాజాగా కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయి అని తెలుస్తోంది. ఎట్టకేలకు ఆమెకు తెలుసు సినిమాలో అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. అది కూడా స్టార్ హీరో సినిమాలో. ఆ స్టార్ మరెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

అవును, విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలాతో “రౌడీ జనార్ధన” ఒక మాస్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గురించి చాలా వార్తలే వైరల్ అయ్యాయి. ముందుగా ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నను తీసుకోవాలని అనుకున్నారట కానీ, ఎందువల్లో అది కుదరలేదు. తరువాత కూడా చాలా అప్షన్స్ అనుకున్నప్పటికీ చివరికి ఆ అవకాశం కీర్తి సురేష్ కి దక్కినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. ఇక ఎట్టకేలకు కీర్తి సురేష్ తెలుగు సినిమాలో కనిపిస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ సినిమా అయినా ఆమెకు మంచి విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.