Keerthy Suresh Shares Mahindra Thar Driving in Beach Video
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ తెలుగు, తమిళ్ సినిమాలతో దూసుకుపోతుంది. దసరాతో సూపర్ హిట్ కొట్టిన కీర్తి ఇటీవల భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం కీర్తి చేతిలో పలు తమిళ సినిమాలు ఉన్నాయి. తమిళ సినిమాలతో బిజీబిజీగా ఉంది కీర్తి సురేష్. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ లో ఉంటూ పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది.
Also Read : Eagle Teaser : రవితేజ ‘ఈగల్’ టీజర్ రిలీజ్.. ఇది విధ్వంసం మాత్రమే.. ముందుంది విశ్వరూపం..
తాజాగా కీర్తి సురేష్ చెన్నైలోని(Chennai) ఓ బీచ్(Beach)లో మహీంద్రా థార్ నడుపుతున్న వీడియో పోస్ట్ చేసింది. సినిమాల్లో హీరోలు ఛేజింగ్ సీన్స్ లో నడిపినట్టు బీచ్ ఇసుకలో కీర్తి సురేష్ ఓ రేంజ్ లో స్టైలిష్ గా ఆ జీప్ ని నడిపింది. ఈ వీడియో పోస్ట్ చేసి ఆదివారం పూట చెన్నై బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిపింది. దీంతో కీర్తి సురేష్ థార్ నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వామ్మో కీర్తి ఈ రేంజ్ లో వెహికల్ డ్రైవ్ చేస్తుందా, కీర్తి అదరగొడుతుందిగా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.