Keerthy Suresh : కీర్తి సురేష్ సినిమా.. సాంగ్స్ యూట్యూబ్ లో కాకుండా వెరైటీగా రిలీజ్..

కీర్తి సురేష్ - సుహాస్ జంటగా తెరకెక్కుతున్న ఉప్పు కప్పురంబు.

Keerthy Suresh Suhas Uppu Kappurambu Songs Released

Keerthy Suresh : సినిమా రిలీజ్ ల ముందు సాంగ్స్ రిలీజ్ చేస్తారని తెలిసిందే. అయితే సాంగ్స్ ని కూడా టీజర్, ట్రైలర్స్ లాగే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు అన్ని సినిమాలకు. కానీ తాజాగా కీర్తి సురేష్ చేస్తున్న ఉప్పు కప్పురంబు సినిమా సాంగ్స్ యూట్యూబ్ లో కాకుండా మ్యూజిక్ యాప్స్ లో రిలీజ్ అవ్వడం గమనార్హం.

కీర్తి సురేష్ – సుహాస్ జంటగా తెరకెక్కుతున్న ఉప్పు కప్పురంబు సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి జులై 4 రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్‌ను నేడు బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో మూడు పోరాటాలు ఉన్నాయి.

Also See : Akhil Akkineni : మొదటిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన అక్కినేని అఖిల్.. మరిన్ని కొత్త ఫొటోలు..

స్వీకార్ అగస్తి సంగీత దర్శకత్వంలో ఈ పాటలను రవికృష్ణ విస్సాప్రగడ, ఎస్. అత్తావుర్ రహీం, రఘురాం ద్రోణావజ్జల రాయగా సీన్ రోల్డన్, అనురాగ్ కులకర్ణి, ఆంటోని దాసన్ పాడారు. ఈ పాటలను యూట్యూబ్ లో కాకుండా అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్, ఆపిల్ మ్యూజిక్.. లాంటి మ్యూజిక్ యాప్స్‌లో రిలీజ్ చేసారు.