Keerthy Suresh : కీర్తి సురేష్ పెళ్లి పనులు స్టార్ట్.. ఈరోజే పెళ్లి..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్.

Keerthy Suresh : కీర్తి సురేష్ పెళ్లి పనులు స్టార్ట్.. ఈరోజే పెళ్లి..

Keerthy Suresh wedding work has started to get married today

Updated On : December 12, 2024 / 11:02 AM IST

Keerthy Suresh : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. టాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, అలాగే తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మరికొన్ని గంటల్లో పెళ్లి కూతురు కాబోతుంది.

Also Read : Big Boss 8 : బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా ఐకాన్ స్టార్.. విన్నర్ కి ట్రోఫీ అందించేది బన్నీనేనా..

నేడు (డిసెంబర్‌ 12న) వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది. గోవాలోని ప్రముఖ రిసార్ట్‌ లో వీరి పెళ్లికి జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు గోవాకి చేరుకొని పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే పెళ్లి ఏర్పాట్లలో భాగంగా.. తమ పెళ్ళికి వచ్చే అతిదులందరికి ప్రత్యేకమైన ‘KA’ అని ముద్రించి ఉన్న హ్యాండ్‌ బ్యాండ్స్‌ ఇచ్చారట. వీటిని వేసుకొని వస్తే మాత్రమే పెళ్ళికి అనుమతిస్తారని అంటున్నారు. అలాగే అతిధులు ఉండే గదుల్లో ‘వెల్‌కమ్‌ టు ది వెడ్డింగ్‌ మ్యాడ్‌నెస్‌’ అనే మ్యాగజైన్స్ ఉంచారట. ఇందులో వీరికి సంబందించిన స్టోరీ ఉంటుందని తెలుస్తుంది.


మొత్తానికి తన పెళ్ళికి సంబంచించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది కీర్తి. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి ఆమెనే చూసుకుంటుంది. కాగా ఈమె సినిమాల విషయానికొస్తే.. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `బేబీ జాన్‌` సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.