మహానటి సావిత్రిలాగే: గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిన కీర్తి సురేష్‌

  • Published By: veegamteam ,Published On : October 9, 2019 / 04:29 AM IST
మహానటి సావిత్రిలాగే: గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిన కీర్తి సురేష్‌

Updated On : October 9, 2019 / 4:29 AM IST

మ‌హాన‌టి సినిమాతో అందరి మ‌న‌సులు గెలుచుకున్న కీర్తి సురేష్. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం మిస్ ఇండియా అనే సినిమాలో న‌టిస్తుంది. దీంతో పాటు హిందీ, త‌మిళంలోను సినిమాలు చేస్తుంది.

ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు నిర్మిస్తున్న మిస్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. కీర్తి 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా రీసెంట్‌గా సెట్స్‌ పైకి వెళ్ళింది. దీనికి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక వ‌చ్చే ఏడాది సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నారు. 

ఇక అసలు విషయం ఏమిటంటే… కీర్తీ సురేష్ ఈ మూవీ టీం అంద‌రికి గోల్డ్ కాయిన్స్ బ‌హుమ‌తిగా అందించింద‌ట‌. దీంతో మూవీ టీం సంతోషం తట్టుకోలేక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె గోల్డ్‌ కాయిన్స్ ఇలా బ‌హుమ‌తిగా ఇవ్వ‌డంతో చిత్ర బృందం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని తెలిపారు‌.

గ‌తంలో ప‌లువురు స్టార్ హీరోలు కూడా ఇలా కాయిన్స్ గిఫ్ట్‌గా అందించారు. మహానటి సావిత్రి కూడా తను హీరోయిన్ ఉన్న సమయంలో ఇలాగే యూనిట్ సభ్యులు అందరికీ గిఫ్ట్ లు ఇచ్చేదట. ఈ విషయాన్ని పలువురు దర్శకులు వారి అనుభవాలలో పంచుకున్నారు.