IND vs PAK : పాక్‌పై భార‌త్ ఘ‌న విజయం.. గంభీర్ ఏమ‌న్నాడో తెలుసా?

ఆసియాక‌ప్‌లో భాగంగా దుబాయ్ వేదిక‌గా ఆదివారం పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌(IND vs PAK)లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs PAK : పాక్‌పై భార‌త్ ఘ‌న విజయం.. గంభీర్ ఏమ‌న్నాడో తెలుసా?

Asia Cup 2025 Gautam Gambhir comments viral after india win the match against Pakistan

Updated On : September 15, 2025 / 11:41 AM IST

IND vs PAK : ఆసియాక‌ప్ 2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా ఆదివారం భార‌త్, పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. పాక్ నిర్దేశించిన 128 ప‌రుగుల స్వ‌ల్ప లక్ష్యాన్ని 15.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజ‌యంతో టీమ్ఇండియా పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది. ఇక మ్యాచ్‌లో గెలిచిన త‌రువాత భార‌త ఆట‌గాళ్లు పాక్ ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాల‌నం చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది.

మ్యాచ్ అనంత‌రం టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డం చాలా బాగుందన్నాడు. ఈ విజ‌యాన్ని ప‌హ‌ల్గాం దాడిలో అమ‌రులైన వారి కుటుంబాలకు అంకితం చేస్తున్నాము. ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా పూర్తి చేసినందుకు భారత సైన్యానికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాము. దేశానికి ఎల్ల‌ప్పుడూ గ‌ర్వ‌కార‌ణంగా ఉండేలా జ‌ట్టు కృషి చేస్తుంది అని గంభీర్ తెలిపాడు.

Shoaib Akhtar : టీమ్ఇండియా ‘నో హ్యాండ్‌షేక్’ పై అక్త‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. అభినంద‌న‌లు చెబుతూనే..

ఇదిలా ఉంటే.. ఒక నివేదిక ప్రకారం ఈ హ్యాండ్‌షేక్ స్నబ్ ఐడియాను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రతిపాదించాడు. గంభీర్ భారత ఆటగాళ్లకు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయవద్దని, చిరకాల ప్రత్యర్థులతో మాట్లాడ‌వ‌ద్ద‌ని తెలిపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 127 ప‌రుగులు చేసింది. పాక్ బ్యాట‌ర్ల‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (44 బంతుల్లో 40 ప‌రుగులు), షహీన్‌ షా అఫ్రిది (16 బంతుల్లో 33 నాటౌట్‌) రాణించారు. భార‌త బౌలర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్లు తీశాడు. అక్ష‌ర్ ప‌టేల్‌, బుమ్రా చెరో రెండు వికెట్లు సాధించారు. హార్దిక్ పాండ్యా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిలు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Pakistan : భార‌త్ చేతిలో ఘోర ఓట‌మి.. అదే జ‌రిగితే ఆసియాక‌ప్ 2025 నుంచి పాక్ ఔట్‌!

ఆ త‌రువాత కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (37 బంతుల్లో 47 నాటౌట్‌), అభిషేక్ శ‌ర్మ (13 బంతుల్లో 31 ప‌రుగులు), తిల‌క్ వ‌ర్మ (31 బంతుల్లో 31 ప‌రుగులు) దంచికొట్ట‌డంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 15.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.