Shoaib Akhtar : టీమ్ఇండియా ‘నో హ్యాండ్‌షేక్’ పై అక్తర్ కీలక వ్యాఖ్యలు.. అభినందనలు చెబుతూనే..
మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. దీనిపై పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) స్పందించాడు.

Shoaib Akhtar key comments on Indias No Handshake Act
Shoaib Akhtar : మెగాటోర్నీలో భారత జట్టు పాక్ పై మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆసియాకప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో 25 బంతులు మిగిలి ఉండగా.. 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఇక మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది.
పహల్గాం ఉగ్రదాడికి నిరసగా మెగావేదికగా పాక్‌కు మంచి బుద్ధి చెప్పినట్లు అయిందని భారత ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) టీమ్ఇండియా పై ప్రశంసలు కురిపిస్తూనే రాజకీయాతో ఆటలను ముడిపెట్టవద్దని కోరాడు.
Pakistan : భారత్ చేతిలో ఘోర ఓటమి.. అదే జరిగితే ఆసియాకప్ 2025 నుంచి పాక్ ఔట్!
Shoaib Akhtar crying over the handshake saga 😂 Same guy was chilling with Asim Munir & Afridi months back. Well done Surya – strike as deep as Nur Khan Air Base! 🔥🇮🇳 #INDvsPAK #IndianCricket #IndiaVsPakistan #aisacup2025 #indvspak2025 https://t.co/6O4XkugN8U pic.twitter.com/t9V8pCk0U8
— Gaurav (@k_gauravs) September 15, 2025
‘నాకు మాటలు రావడం లేదు. ఇలాంటివి చూస్తానని అనుకోలేదు. ఇది ఎంతో భాధించింది. ఏమి చెప్పాలో తెలియడం లేదు. గెలుపొందిన భారత్‌కు అభినందనలు. క్రికెట్ ను రాజకీయం చేయకండి. ఇప్పటి వరకు ఎన్నో విషయాల గురించి మాట్లాడాము. కరచాలనం పై ఏదో ఒకటి చెప్పవచ్చు. ప్రతి ఇంటిలోనూ గొడవలు జరుగుతుంటాయి. వాటిని మరిచిపోయి ముందుకు సాగాలి. ఇది క్రికెట్ గేమ్. కరచాలనం చేసి ఉంటే బాగుండేది.’ అని అక్తర్ అన్నాడు.
పాక్ బ్యాటర్లపై ఆగ్రహం..
పాక్ బ్యాటర్లపై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని సరిగ్గా చూడకుండానే ఆడారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కుల్‌దీప్ యాదవ్ బంతి విసిరే విధానాన్ని పాక్ బ్యాటర్లు రీడ్ చేయలేదన్నాడు.
మ్యాచ్‌కు ముందు తాను సునీల్ గవాస్కర్‌తో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనానని తెలిపాడు. అప్పుడు సునీల్ ఒకటే చెప్పాడు.. బంతి కుల్దీప్ యాదవ్ చేతి నుంచి పిచ్ పై పడే వరకూ నిశితంగా గమనించాలని, అప్పుడే ఎలా ఆడాలో అనే విషయం తెలుస్తుందన్నాడు. అలా చేయకపోతే అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనడం చాలా కష్టం అని చెప్పాడన్నాడు. ఇక పాక్ బ్యాటర్లు ప్రతి రెండో బంతిని స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించారన్నాడు. దీన్ని బట్టి వారు బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారన్నాడు.
IND vs PAK : ప్రెజెంటేషన్ వేడుకకు రాని పాక్ కెప్టెన్.. కోచ్ ఏమన్నాడంటే..?
ఇదిలా ఉంటే.. ఒక నివేదిక ప్రకారం ఈ హ్యాండ్‌షేక్ స్నబ్ ఐడియాను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రతిపాదించాడు. గంభీర్ భారత ఆటగాళ్లకు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయవద్దని, చిరకాల ప్రత్యర్థులతో మాట్లాడవద్దని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.