21 మంది 10 వేల మందితో పోరాడితే?

అక్షయ్ కుమార్-కేసరి ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 21, 2019 / 06:57 AM IST
21 మంది 10 వేల మందితో పోరాడితే?

Updated On : February 21, 2019 / 6:57 AM IST

అక్షయ్ కుమార్-కేసరి ట్రైలర్ రిలీజ్..

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న రీసెంట్ మూవీ, కేసరి. పరిణితీ చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా, ధర్మా ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, అజూర్ ఎంటర్‌టైన్‌మెంట్, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. మొన్నామధ్య గ్లింప్స్ ఆఫ్ కేసరి-పార్ట్ 1 పేరుతో ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్, ఇప్పుడు కేసరి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు.ఈ సినిమాలో అక్షయ్.. 1891లో జరిగిన సారాగడి యుద్ధంలో పాల్గొన్న హవీల్దార్ ఇషార్ సింగ్‌ క్యారెక్టర్ చేస్తున్నాడు. మూడు నిమిషాల కేసరి ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను తన బానిసనని, భారతీయులంతా మూర్ఖులని ఓ బ్రిటీష్ వ్యక్తి నాతో అన్నాడు. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన సయయం వచ్చింది.. అని అక్షయ్ చెప్పే ఆసక్తి కరమైన డైలాగుతో ప్రారంభమైన కేసరి ట్రైలర్, ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది.

నేను ధరించిన తలపాగా కేసరి (కాషాయం), కారుతున్న నా నెత్తురు కేసరి.. అంటూ అక్షయ్ చెప్పే డైలాగ్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1891 టైమ్‌లో, సారాగడి ప్రాంతంలో 21 మంది సిక్కులకు, పదివేల మంది అఫ్ఘానీయులకు మధ్య యుద్ధం జరుగుతుంది. అసలు ఆ వార్ అనేది ఎందుకు చెయ్యాల్సి వచ్చింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? అనే కథతో రూపొందుతున్న కేసరి ట్రైలర్‌లో, అక్షయ్ కుమార్ యాక్షన్ సీక్వెన్స్ అదరహో అనేలా ఉన్నాయి. అన్షుల్ చౌబే ఫోటోగ్రఫీ, రాజు సింగ్ ఆర్ఆర్ బాగున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కేసరి, మార్చి 21 న రిలీజవబోతుంది.

వాచ్ కేసరి ట్రైలర్…