తెలుగు ఇండియన్ ఐడల్ 3 నుండి కేశవ్ రామ్ ఎలిమినేట్.. పాత రోజులను గుర్తు చేసుకున్న హీరో నవీన్ పోలిశెట్టి
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా అందిస్తున్న అద్భుతమైన కార్యక్రమాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి.

Keshav Ram eliminated from aha Telugu Indian Idol 3
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా అందిస్తున్న అద్భుతమైన కార్యక్రమాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూడో సీజన్ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో తాజాగా తన అద్భుత పాటలతో ఆకట్టుకున్న కేశవ్ రామ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతడి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు షాక్ అయ్యారు.
కేశవ్ కంటే ముందు ఈ సీజన్‌లో షో కుశాల్ శర్మ, హరి ప్రియ, రాంజీ శ్రీ పూర్ణిమ, శ్రీ ధృతి, అభిగ్న, సాయి వల్లభలు ఎలిమినేట్ అయ్యారు. కేశవ్ రామ్ ఎలిమినేట్ కావడంతో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఊహించని మలుపు తిరిగింది. ఇటీవల ఎపిసోడ్స్‌లో కేశవ్ రామ్, శ్రీకీర్తి, స్కంద లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. స్కందకు అత్యధిక ఓట్లు వచ్చాయి. అదే సమయంలో కేశవ్ అత్యల్ప ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయ్యారు. అతడు ఎలిమినేట్ కావడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు.
Allu Arjun: అత్యాధునిక వసతులతో అల్లు అర్జున్ కొత్త ఇల్లు
ఈ షోలో న్యాయనిర్ణేత అయిన సింగర్ కార్తీక్ నవంబర్ 9న హైదరాబాద్‌లో, సెప్టెంబర్ 28న తిరుపతిలో జరగబోయే కచేరీలలో పాల్గొనవలసిందిగా కేశవ్‌ను ఆహ్వానించారు.
గెస్ట్‌గా హాజరైన నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభంలో ఒక కీలకమైన క్షణాన్ని వివరించాడు. కెరీర్ ప్రారంభంలో ఓ మంచి సక్సెస్ కోసం ఎన్నో రోజులు ఎదురుచూశాను. ఓ యాక్టింగ్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్ని వచ్చింది. ఆ షోలో విజేతగా నిలిచిన వారికి ఓ టాప్ బ్యానర్‌లో బాలీవుడ్‌లోని ఓ మూవీలో నటించే ఛాన్స్ వస్తుందని చెప్పారు. నేను అద్భుతంగా పర్ఫామెన్స్ చేస్తున్నప్పటికి నాలుగో రౌండ్‌లోనే ఎలిమినేట్ అయ్యాను.
Asha Sharma : సినీ పరిశ్రమలో విషాదం.. ‘ఆదిపురుష్’ నటి ఆశా శర్మ కన్నుమూత
ఇప్పుడు కేశవ్‌ను చూడగానే నాకు ఆ రోజు గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో నేను ఎంతో నిరాశపడ్డాను. నా సామర్థ్యాలను ప్రశ్నించుకున్నాను. అయితే.. ఆ షోలో విజేతగా నిలిచిన వ్యక్తి ఇంత వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే.. నేను మాత్రం హీరోను అయ్యాను. ప్రేక్షకుల మద్దతు ఊహించలేనిది. కేశవ్‌ను ప్రొత్సహించేందుకు దీన్ని నేను పంచుకున్నాను అని హీరో నవీన్ పోలిశెట్టి తెలిపారు.