Allu Arjun: అత్యాధునిక వసతులతో అల్లు అర్జున్ కొత్త ఇల్లు
అల్లు కొత్త ఇల్లు... తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్ట్‌లీ ఇళ్లలో ఒకటిగా ఉంటుందని అంటున్నారు.

పుష్ప-2 రిలీజ్‌కు ముందు బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడట… పుష్ప సినిమాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టైలిష్ స్టార్…. హైదరాబాద్‌లో మిగిలిన యాక్టర్స్‌కు డిఫరెంట్‌గా ఉండేలా ప్రయత్నాలు చేస్తుంటాడు. దీంతో బన్నీ ఏది చేసినా సంచలనమే అవుతోంది. తాజా అల్లు ఆర్మీ కోసం బన్నీ నిర్మిస్తున్న ఓ భవనం టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారింది…
పుష్ప-2 ‘సినిమాతో బిజీబిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ సినిమా రిలీజ్‌కు ముందే అభిమానులకు సరప్రైజ్ చేయనున్నాడని టాలీవుడ్ టాక్. డిసెంబర్ 6న పుష్ప-2 సినిమా రిలీజ్ కానుండగా, అంతకుముందే కొత్త ఇంట్లోకి షిప్ట్ అవ్వాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడట… ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లు, ఆఫీస్‌ను విశాలమైన మరో ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని చాలాకాలం నుంచి ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.
కోట్ల రూపాయల వ్యయంతో
ఇందులో భాగంగానే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి ఏరియాలో కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ఇంటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భవనంలో తన నివాసంతోపాటు ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నట్లు టాక్. దాదాపు మూడు వేల చదరపు అడుగుల వైశాల్యంలో అత్యాధునిక సౌకర్యాలతో ఇల్లు నిర్మిస్తున్నాడట. ఇప్పటికే 60 శాతం నిర్మాణం పూర్తైనట్లు టాక్. మంచి ముహూర్తం చూసుకుని అల్లు అర్జున్ సతీసమేతంగా గృహప్రవేశం చేస్తారని సన్నిహితులు చెబుతున్నారు.
అల్లు కొత్త ఇల్లు… తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్ట్‌లీ ఇళ్లలో ఒకటిగా ఉంటుందని అంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంటికి సమీపంలో మైత్రీ మూవీస్ ఆఫీస్ పక్కనే అల్లు ఇల్లు నిర్మిస్తున్నారని సమాచారం. ఇందులో ఫ్యాన్స్‌ను కలవడానికి ప్రత్యేకంగా ఓ రూమ్ కేటాయించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న ఇంట్లో ఫ్యాన్స్ వస్తే బయటనే కలిసే పరిస్థితి ఉంది. ఇక నుంచి తన ఆర్మీకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కొత్త ఇంట్లో సౌకర్యాలు సమకూర్చుతున్నట్లు చెబుతున్నారు. దీంతో బన్నీ కొత్త బిల్డింగ్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Chiranjeevi: అభిమాని కుటుంబాన్ని సత్కరించిన చిరంజీవి