Chiranjeevi: అభిమాని కుటుంబాన్ని సత్కరించిన చిరంజీవి
ఆ కుటుంబ సభ్యులకు పట్టు బట్టలు పెట్టి సత్కరించారు. ఈశ్వరయ్య ఫ్యామిలీకి అండగా..

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తన అభిమాని ఈశ్వరయ్య కుటుంబాన్ని సత్కరించారు. ఈ నెల 22న చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఈశ్వరయ్య తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
దీంతో ఈశ్వరయ్య, ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని తన ఇంటికి ప్రత్యేకంగా చిరు పిలిపించుకున్నారు. ఆ కుటుంబ సభ్యులకు పట్టు బట్టలు పెట్టి సత్కరించారు. ఈశ్వరయ్య ఫ్యామిలీకి అండగా ఉంటానని చిరు చెప్పారు. కాగా, ఇవాళ చిరంజీవి అయ్యప్ప మాల ధరించారు. ఆయన ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తారన్న విషయం విదితమే.
చిరంజీవి మొదట నుంచి తన వీరాభిమానులకు అండగా నిలుస్తుంటారు. గతంలోనూ ఈశ్వరయ్య తిరుపతి నుంచి చిరంజీవి ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజుతో పాటు ఆ పార్టీ ఎన్నికల్లో గెలవాలని కూడా అనేక సార్లు ఆయన పొర్లు దండాలు పెట్టారు.