Mufasa The Lion King Trailer : మహేశ్‌బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా : ద లయన్ కింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. అదుర్స్..
యాక్షన్ అడ్వెంచర్ మూవీ లయన్ కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Mufasa The Lion King telugu Trailer out now
Mufasa The Lion King Trailer : యాక్షన్ అడ్వెంచర్ మూవీ లయన్ కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1994లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ రాబోతుంది. ముఫాసా అసలు లయన్ కింగ్ ఎలా అయ్యాడన్న బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బారీ జెంకిన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ..ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండనుంది. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మన దేశంలో కూడా హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే హిందీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా.. తాజాగా తెలుగు ట్రైలర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా విడుదలైంది.
Kannappa : ‘కన్నప్ప’లో మంచు విష్ణు కొడుకును చూశారా..? అవ్రామ్ స్పెషల్ పోస్టర్ విడుదల
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ముఫాసా పాత్రకు హీరో మహేశ్ బాబు వాయిస్ ఇచ్చారు. ఇక హిందీలో ముఫాసా పాత్రకు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. ఆయా బాషల్లో స్టార్ హీరోలు ముఫాసా పాత్రకు వాయిస్ ఇస్తున్నారు. కాగా.. తెలుగు ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంటోంది.