Kannappa : ‘కన్నప్ప’లో మంచు విష్ణు కొడుకును చూశారా..? అవ్రామ్ స్పెషల్ పోస్టర్ విడుదల
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘కన్నప్ప’.

Manchu Vishnu Son Avram as Thinnadu in Kannappa
Kannappa – Avram : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘కన్నప్ప’. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్, లేడీ సూపర్ స్టార్ నయనతార, శివరాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదండోయ్ ఈ మూవీలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు కూడా నటిస్తున్నాడు.
ఇక నేడు (ఆగస్టు 26) సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అవ్రామ్ సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో అవ్రామ్ ‘తిన్నడు’ పాత్రలో నటిస్తున్నాడు. యుద్ధానికి నేను సిద్ధం అన్నట్లుగా అతడి ఫోజు ఉంది. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Actor Darshan : ఏందీ అన్నా ఇదీ.. పిక్నిక్‌కు వెళ్లావా ఏందీ..! జైల్లో దర్శన్‌కు రాజభోగాలు?
మంచు వారి మూడు తరాలు ఈ మూవీలో కనిపించబోతున్నారు. మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు కలయికతో ఈ చిత్రం మంచు కుటుంబానికి స్పెషల్ మూవీ కానుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.
Amy Jackson : పెళ్లి చేసుకున్న రామ్‌చరణ్ హీరోయిన్.. ఒకరితో బిడ్డను కని, మరొకరితో..
Here is my Avram. Happy Janmashtami.#Kannappa #AvramManchu #Janmashtami pic.twitter.com/pGku4BnUyx
— Mohan Babu M (@themohanbabu) August 26, 2024