Amy Jackson : పెళ్లి చేసుకున్న రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్‌.. ఒకరితో బిడ్డ‌ను క‌ని, మ‌రొక‌రితో..

బ్రిటిష్ – ఇండియన్ యాక్టర్ అమీ జాక్సన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Amy Jackson : పెళ్లి చేసుకున్న రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్‌.. ఒకరితో బిడ్డ‌ను క‌ని, మ‌రొక‌రితో..

Amy Jackson and Ed Westwick Married in Italy

Updated On : August 26, 2024 / 7:01 AM IST

Amy Jackson wedding : బ్రిటిష్ – ఇండియన్ యాక్టర్ అమీ జాక్సన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. తెలుగు, తమిళ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాలతో త‌న దైన ముద్ర వేసింది. ఈ అమ్మ‌డు ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకుంది. హాలీవుడ్ న‌టుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను పెళ్లాడింది. ఇట‌లీలో వీరి వివాహం ఎంతో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ విషయాన్ని స్వ‌యంగా వీరిద్ద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. అంతేకాదండోయ్ త‌మ పెళ్లి ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. కొత్త ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లైంది అంటూ రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజ‌న్లు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉన్న వీరిద్ద‌రు తాజాగా ఒక్క‌టి అయ్యారు.

Megha Akash : ప్రియుడితో క‌లిసి సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఇంటికి వెళ్లిన మేఘా ఆకాష్‌..

ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌కు చెందిన జార్జ్‌ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో గ‌తంలో అమీ జాక్స‌న్ రిలేష‌న్ షిప్‌లో ఉంది. కొంత‌కాలం పాటు వీరిద్ద‌రు స‌హ‌జీవ‌నం చేశారు. వీరికి ఆండ్రూ అనే బాబు జ‌న్మించాడు. 2020లో పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా వేసుకున్నారు. అయితే.. ఆ త‌రువాత వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయారు. ఆ త‌రువాత సౌదీ అరేబియాలో జ‌రిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఎడ్‌ను మొద‌టిసారి క‌లుసుకుంది అమీ.

Sitara : అన్న‌య్య గౌతమ్ సీక్రెట్‌ను రివీల్ చేసిన సితార..!

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)