Megha Akash : ప్రియుడితో కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి వెళ్లిన మేఘా ఆకాష్..
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి మేఘా ఆకాష్.

Actress Megha Akash invites Super star Rajinikanth to her marriage
Megha Akash-Rajinikanth : తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి మేఘా ఆకాష్. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇటీవల తన ప్రియుడు సాయి విష్ణుతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆమె పంచుకుంది. ఇక ఆమె వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
సినీ పెద్దలను కాబోయే వధూవరులు కలుసుకుంటూ తమ పెళ్లికి రావాలని ఆహ్వానిస్తున్నారు. సినీ పరిశ్రమలో తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి తనకు కాబోయే భర్తతో కలిసి వెళ్లింది మేఘా ఆకాష్. తన పెళ్లికి రావాలని సూపర్ స్టార్‌కు పెళ్లి పత్రికను అందజేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నాకెంతో ఇష్టమైన వ్యక్తిని ఆహ్వానించాం.’ అంటూ రాసుకొచ్చింది.
Buddy OTT : ఓటీటీలోకి అల్లు శిరీష్ ‘బడ్డీ’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఆమె వివాహం ఎక్కడ జరగనుంది. పెళ్లి తేదీ ఎప్పుడు అనే వివరాలు అయితే ఇప్పటి వరకు తెలియరాలేదు.
ఇదిలా ఉంటే.. నితిన్ హీరోగా నటించిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు మేఘా ఆకాష్ పరిచయమైంది. ‘ఛల్ మోహన రంగ, ‘రాజరాజ చోర’, ‘డియర్ మేఘ’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘ప్రేమదేశం’, ‘రావణాసుర’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసింది. ఇక తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో కీలక పాత్రను పోషించింది. ఇటీవలే విజయ్ ఆంటోని ‘తుఫాన్’ అనే తమిళ మూవీతో అలరించిన ఆమె ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది.
Sitara : అన్నయ్య గౌతమ్ సీక్రెట్‌ను రివీల్ చేసిన సితార..!
View this post on Instagram