Kevvu Kartheek Wife : మా నాన్నని చివరి చూపు చూసుకోలేకపోయా.. జబర్దస్త్ కెవ్వు కార్తీక్ భార్య ఎమోషనల్..

ఈ ఈవెంట్లో కెవ్వు కార్తీక్ భార్య మాట్లాడుతూ జబర్దస్త్ తో వాళ్ళ నాన్నకు ఉన్న అనుబంధం చెప్తూ, వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.

Kevvu Kartheek Wife

Kevvu Kartheek Wife : జబర్దస్త్ కెవ్వు కార్తీక్ 2023 లో శ్రీలేఖ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. కార్తీక్ రెగ్యులర్ గా తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేయగా ఈ ఈవెంట్ కి కెవ్వు కార్తీక్ తన భార్యతో కలిసి వచ్చాడు.

ఈ ఈవెంట్లో కెవ్వు కార్తీక్ భార్య మాట్లాడుతూ జబర్దస్త్ తో వాళ్ళ నాన్నకు ఉన్న అనుబంధం చెప్తూ, వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.

Also Read : Upasana : సద్గురు మా అమ్మాయికి డైలీ ఆ ఫుడ్ పెట్టామన్నారు.. క్లిన్ కారా డైలీ ఇది కచ్చితంగా తింటుందట..

కెవ్వు కార్తీక్ భార్య శ్రీలేఖ మాట్లాడుతూ.. మా నాన్న జబర్దస్త్ ప్రతి ఎపిసోడ్ చూసేవాళ్ళు. గురు, శుక్రవారాలు తన పని నుంచి తొందరగా వచ్చి జబర్దస్త్ చూసేవాళ్ళు. కరోనా సమయంలో మా నాన్న కరోనాతో చనిపోయారు. నేను, మా చెల్లి లండన్ లో ఉన్నాం. రావడానికి కుదర్లేదు. అమ్మకి కూడా కరోనా వచ్చి ఇంట్లో ఉంది. నాన్న హాస్పిటల్ లో చనిపోయారు. అక్కడే అంతా అయిపోయిది. మాకు చివరి చూపు కూడా మిగల్లేదు అంటూ ఎమోషనల్ అయింది.

అలాగే.. మా నాన్న చనిపోయాక రెండేళ్లకు కార్తీక్ మ్యాచ్ వచ్చింది. ఓకే అనుకున్నాం, పెళ్లి అయిపొయింది. ప్రతి నాన్నకు తన కూతురి పెళ్లి ఘనంగా చేయాలి అనుకుంటాడు. మా నాన్న కూడా అలాగే అనుకున్నాడు. కానీ చేయడానికి మా నాన్న లేడు. ఒక చిన్న హ్యాపినెస్ ఏంటి అంటే మా నాన్నజబర్దస్త్ చూస్తాడు కాబట్టి కార్తీక్ ఫేస్ తెలుసు, మా నాన్నకు తెలిసిన అతన్నే పెళ్లి చేసుకున్నాను అని హ్యాపీ. మా నాన్న చూసి ఉంటారు కార్తీక్ ని అని సంతృప్తి. జబర్దస్త్ లో అందరికి ఫేమ్, సక్సెస్ వచ్చింది. కార్తీక్ కి వచ్చిన సక్సెస్ తో తన తల్లిని కొన్ని రోజులు ఎక్కువ బతికించుకోగలిగారు. అందుకు నేను అతన్ని చూసి గర్వపడతాను అని తెలిపింది.

Also Read : NTR Fan : 10 టీవీ చొరవ.. దూరం నుంచి వచ్చిన మూగ అభిమానిని కలిసిన ఎన్టీఆర్.. ఫొటోలు, వీడియోలు వైరల్..