Bollywood : అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ని బీట్ చేసిన ‘కేజిఎఫ్ 2’

గత కొద్ది రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వినిపిస్తున్న పేర్లు రెండే. ఒకటి ఆర్ఆర్ఆర్ ఇంకోటి 'కేజిఎఫ్ 2'. మన సినిమాలు నార్త్ లో కూడా భారీ విజయం సాధించి పాన్ ఇండియా సినిమాలుగా......

Rrr Kgf

 

RRR vs KGF 2 :  గత కొద్ది రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వినిపిస్తున్న పేర్లు రెండే. ఒకటి ఆర్ఆర్ఆర్ ఇంకోటి ‘కేజిఎఫ్ 2’. రామ్ చరణ్, తారక్ కలిసి నటించగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ముందు నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకి తగ్గట్టే ఈ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్లని కూడా రాబట్టింది. సినిమా రిలీజ్ అయి దాదాపు నెల రోజులు కావొస్తున్నా ఇంకా చాలా థియేటర్లో ఆర్ఆర్ఆర్ ఆడుతుంది, కలెక్షన్లని రాబడుతుంది.

ఇటీవల మన సినిమాలు నార్త్ లో కూడా భారీ విజయం సాధించి పాన్ ఇండియా సినిమాలుగా నిరూపించుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా నార్త్ లో బాగా ఆడింది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంకా కలెక్షన్లని రాబడుతూనే ఉంది. అయితే ఈ సినిమా నాలుగు వారాలకు గాను హిందీలో 258 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకు ‘కేజిఎఫ్ 2’ సినిమా రిలీజ్ అయింది.

Surekha Vani : ఫ్లైట్‌లో మందు.. బ్యాంకాక్‌లో మసాజ్.. రచ్చ చేస్తున్న తల్లి కూతుళ్లు..

‘కేజిఎఫ్ 2’ సినిమా కూడా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి భారీ విజయం సాధించి కలెక్షన్లని కొల్లగొడుతుంది. ఈ సినిమా కూడా నార్త్ ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. దీంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లని రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తుంది. ‘కేజిఎఫ్ 2’ సినిమా కేవలం 11 రోజుల్లోనే హిందీలో 300 కోట్లు కలెక్ట్ చేసి ఆర్ఆర్ఆర్ సినిమాని బీట్ చేసేసింది. హిందీలో ఆర్ఆర్ఆర్ నెల రోజులకి 258 కోట్లు కలెక్ట్ చేస్తే ‘కేజిఎఫ్ 2’ రెండు వారాల లోపే 300 కోట్లు కలెక్ట్ చేసి షాకిచ్చింది. ఇంకా ప్రస్తుతం థియేటర్లలో ‘కేజిఎఫ్ 2’ఆడుతుంది కాబట్టి ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

NV Prasad : సోషల్ మీడియాలో చిరంజీవిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు.. నా ముందుకొచ్చి మాట్లాడండి..

మొత్తానికి బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ కంటే ‘కేజిఎఫ్ 2’ కలెక్షన్ల పరంగా పెద్ద హిట్ గా నిలిచింది. ఇటీవలే రిలీజ్ అయిన హిందీ జెర్సీ మూవీ వీటికి ఏ రకంగానూ పోటీ రాలేకపోయింది. ఏది ఏమైనా మన సౌత్ సినిమాలు మాత్రం బాలీవుడ్ లో భారీ కలెక్షన్లతో అదరగొడుతున్నాయి. మనకి మనమే పోటీ అన్నట్టు మన సినిమాలకి మనమే పోటీ ఇస్తున్నాము. దీంతో బాలీవుడ్ వర్గాలు మరింత షాకవుతున్నారు.