Surekha Vani : ఫ్లైట్‌లో మందు.. బ్యాంకాక్‌లో మసాజ్.. రచ్చ చేస్తున్న తల్లి కూతుళ్లు..

తాజాగా ఈ తల్లి కూతుళ్లు ఇద్దరూ బ్యాంకాక్ కి చెక్కేశారు. ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో వెళ్తూ మందు తాగిన ఓ వీడియోని, అలాగే బ్యాంకాక్ కి వెళ్లి మసాజ్ చేపించుకుంటున్న ఫోటోని సుప్రీత...

Surekha Vani : ఫ్లైట్‌లో మందు.. బ్యాంకాక్‌లో మసాజ్.. రచ్చ చేస్తున్న తల్లి కూతుళ్లు..

Surekha Vani

Updated On : April 24, 2022 / 4:55 PM IST

Surekha Vani :  ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, రీల్స్, డ్యాన్సులు పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వీరిద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. సురేఖ వాణి ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క కూతురితో కలిసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ఇటీవల గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు.

తాజాగా ఈ తల్లి కూతుళ్లు ఇద్దరూ బ్యాంకాక్ కి చెక్కేశారు. ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో వెళ్తూ మందు తాగిన ఓ వీడియోని, అలాగే బ్యాంకాక్ కి వెళ్లి మసాజ్ చేపించుకుంటున్న ఫోటోని సుప్రీత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అలాగే విమానాశ్రయం, ఫ్లైట్ ఫోటోలని కూడా పోస్ట్ చేశారు. దీంతో ఈ తల్లి కూతుళ్లు ఇద్దరూ మందు తాగుతున్న పోస్ట్, మసాజ్ చేసుకుంటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లి కూతుళ్లిద్దరూ ఈ బ్యాంకాక్ టూర్‌లో ఇంకెన్ని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తారో చూడాలి.

NV Prasad : సోషల్ మీడియాలో చిరంజీవిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు.. నా ముందుకొచ్చి మాట్లాడండి..

ఇక సుప్రీత కూడా ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ వైపు అడుగులు వేస్తుంది. ఇటీవలే తన స్నేహితుడితో కలిసి ఓ ప్రైవేట్ ఆల్బంలో నటించి అలరించింది సుప్రీత. మరి సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి. ఇక వీరి అభిమానులు వీళ్ళ బ్యాంకాక్ ఫోటోల కోసం ఎదురు చూస్తున్నారు.