KGF 2: జీ సంస్థకే శాటిలైట్ హక్కులు.. ధర కూడా భారీగానే!

సినిమా అంటేనే బిజినెస్.. కోట్ల రూపాయల టర్నోవర్ చేసే ఈ బిజినెస్ లో లాభాలు దక్కించుకోవాలంటే టెక్నీక్స్ చాలా ముఖ్యం. అందులో ఒకటి సక్సెస్ కాంబినేషన్.

KGF 2: జీ సంస్థకే శాటిలైట్ హక్కులు.. ధర కూడా భారీగానే!

Kgf 2

Updated On : August 20, 2021 / 4:32 PM IST

KGF 2: సినిమా అంటేనే బిజినెస్.. కోట్ల రూపాయల టర్నోవర్ చేసే ఈ బిజినెస్ లో లాభాలు దక్కించుకోవాలంటే టెక్నీక్స్ చాలా ముఖ్యం. అందులో ఒకటి సక్సెస్ కాంబినేషన్. దర్శక, నిర్మాతల దగ్గర నుండి హీరో-హీరోయిన్స్, ఇతర క్యాస్టింగ్ ఎవరనేదానిపై కూడా బిజినెస్ జరుగుతుంది. కేజేఎఫ్ సినిమాతో హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దక్షణాది నుండి పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయారు. అలాంటి కాంబినేషన్ నుండి.. బ్లాక్ బస్టర్ అయిన కేజేఎఫ్ నుండే మరో భాగమే కేజేఎఫ్-2.

కేజేఎఫ్ రెండో చాప్టర్ మీద భారీ అంచనాలే నెలకొన్న సంగతి తెలిసిందే. ఇండియాలోనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలో కేజేఎఫ్-2 కూడా ఒకటి. ఆ హైప్ తోనే ఈ సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. కేజీఎఫ్-2 సినిమా శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకున్నట్లుగా అధికారికంగానే ప్రకటించారు. దక్షణాది అన్ని భాషలకు సంబంధించి జరిగిన ఈ డీల్ కోసం జీ సంస్థ భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తుంది.

హీరో యష్ కేజేఎఫ్ తొలి భాగం కోసం రూ.11 కోట్ల పారితోషకం తీసుకుంటే.. కేజేఎఫ్-2 కోసం ఏకంగా రూ.30 కోట్లు అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు కేజేఎఫ్-2 ఏ రేంజి సినిమానో. ఇప్పటికే పూర్తయిన ఈ సినిమా కరోనా కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. కాగా, త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటన వచ్చే అవకాశాలుండగా ఈలోగానే సినిమా బిజినెస్ క్లోజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.