KGF హీరో.. క్యూట్‌ బేబీని చూశారా!

‘కేజీఎఫ్‌’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న యశ్‌ గత ఏడాది డిసెంబరులో తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 06:50 AM IST
KGF హీరో.. క్యూట్‌ బేబీని చూశారా!

Updated On : May 8, 2019 / 6:50 AM IST

‘కేజీఎఫ్‌’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న యశ్‌ గత ఏడాది డిసెంబరులో తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.

‘కేజీఎఫ్‌’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న యశ్‌ గత ఏడాది డిసెంబరులో తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. అక్షయ తృతీయ సందర్భంగా పాప తొలి ఫొటోను యశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ పాప‌కి అంద‌రి బ్లెస్సింగ్స్ కావాలని కోరాడు. ‘నా ప్రపంచాన్ని పాలిస్తున్న అమ్మాయిని చూడండి. తనకు ఇంకా పేరు పెట్టలేదు. ఇప్పటి నుంచి తనను ‘బేబీ వైఆర్‌’ అని పిలవండి అని యశ్‌ ట్వీట్‌ చేశారు.

రాధిక,యశ్‌లు 2016లో బ్ర‌హ్మీస్‌-గౌడ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకోగా, డిసెంబ‌ర్ 2,2018న వారికి పండంటి బిడ్డ జ‌న్మించింది. రాధిక‌, య‌శ్‌లు టీవీ సీరియ‌ల్స్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయ‌గా, 2008లో మొగ్గిన మ‌నసు అనే చిత్రంతో తొలిసారి వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. తర్వాత యశ్‌, రాధిక కాంబినేషన్‌లో నాలుగు సినిమాలు వచ్చాయి. దీంతో వీరిద్దరు వెండితెరపై పాపులర్‌ కపుల్‌గా మారారు.