OTT Pay For View
KGF: Chapter 2 : సమ్మర్‌లో దక్షిణాది మూవీల హవా కొనసాగుతోంది. భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ (RRR Collections)బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. ఇప్పుడు కన్నడ బడా హీరో రాకింగ్ స్టార్ యశ్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF: Chapter 2)తో థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. యశ్ మూవీ రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. కొన్నాళ్ల క్రితం.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘KGF Chapter 1 మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో 2018లో విడుదలైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో అన్ని చోట్లా ఈ మూవీకి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లు కొల్లగొట్టింది. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కేజీఎఫ్ ఇతర వెర్షన్లకు ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ‘KGF Chapter 2’ పేరిట సీక్వెల్‌ను రూపొందించారు.
కొన్నేళ్ల పాటు నిరీక్షణ తర్వాత ఈ మూవీ ఏప్రిల్ 14న (రేపు) విడుదల కాబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా.. రూ. 4కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూస్తే.. SS రాజమౌళలి RRR హిందీ వెర్షన్ వసూళ్ల రికార్డులను యష్ మూవీ ఇప్పటికే అధిగమించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రారంభానికి ముందే హిందీ వెర్షన్ రూ. 11 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయట.. RRR హిందీ మూవీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం రూ. 5 కోట్లు కన్నా కొంచెం ఎక్కువగానే చెప్పాలి. తద్వారా వేగంగా కోట్లల్లో వసూలు చేసిన మూవీల జాబితాలో కేజీఎఫ్ 2 మూవీ చేరింది.
Read Also : KGF2-Beast: భారీ బడ్జెట్.. గ్రాండ్ మేకింగ్.. ఇద్దరు బడా స్టార్స్ బాక్సాఫీస్ ఫైట్!
ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కన్నడ మూవీ అన్ని భాషలలో కలిపి మొత్తం రూ.20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌ను వసూలు చేసింది. ఫిల్మ్ ట్రేడ్ అనాలిసిస్ పోర్టల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ట్వీట్ ప్రకారం.. ఈ మూవీ ఇప్పటివరకు ఉత్తరాది అంతటా మొత్తం రూ. 20 కోట్ల టిక్కెట్లు అమ్ముడయినట్టు తెలుస్తోంది. హిందీ వెర్షన్ మొత్తంలో 11.4శాతం వాటాను కలిగి ఉంది. ఈ మూవీ హిందీ వెర్షన్‌కు సంబంధించి ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ‘KGF 2 మూవీ 6 AM మార్నింగ్ షోలు పెరగనున్నాయి.
#Xclusiv… ‘KGF 2’ 6 AM SHOWS & MORE…
? #KGF2 advance booking PHENOMENAL
? Morning shows to start as early as 6 am in #Mumbai and #Pune
? Ticket prices at *select locations*: ₹ 1450 / ₹ 1500 per seat [#Mumbai] and ₹ 1800 / ₹ 2000 per seat [#Delhi]#Toofan is arriving! pic.twitter.com/wnv5aaZQ1j— taran adarsh (@taran_adarsh) April 9, 2022
Kgf Chapter 2 Advance Booking Yash’s Film Sells More Tickets Than Rrr
#KGF2 అడ్వాన్స్ బుకింగ్ కోసం ముంబై, పుణెలలో ఉదయం 6 గంటలకే మార్నింగ్ షోలు ప్రారంభమవుతాయి. టిక్కెట్ ధరలు.. ఒక్కో సీటుకు రూ. 1450 /రూ. 1500 (ముంబై), ఒక్కో సీటుకు రూ. 1800 / రూ. 2000 (ఢిల్లీ). #Toofan తుఫాన్ వస్తోంది’ అంటూ తరుణ్ ట్వీట్‌లో తెలిపారు.
ఇక సినిమా కథలోకి వెళ్తే..
రాకీ (యష్), కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని బంగారు మైనింగ్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ కూడా ఈ సీక్వెల్‌లో నటించారు. KGF: చాప్టర్ 2 ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. ఈ మూవీకి ఉత్తరాదిలో షాహిద్ కపూర్ జెర్సీ నుంచి గట్టి పోటీ ఉండొచ్చునని భావించారు, జెర్సీ మూవీ కూడా ఇదే రోజున రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే జెర్సీ విడుదల తేదీని ఏప్రిల్ 22 (సోమవారం)కి వాయిదా వేశారు. KGF 2 భారీ అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డుల మోత మోగిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘KGF Chapter 2’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీగా వసూళ్లను రాబట్టనుంది. ఈ రికార్డుల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అందులోనూ ఈ మూవీ రిలీజ్ సమయంలో మరో ఇతర సినిమాలు లేకపోవడంతో మరిన్ని వసూళ్లను రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ రికార్డులను మించి యుష్ మూవీ ఇంకా వేగంగా ఎన్ని వసూళ్లను రాబడుతోందో చూడాలి.
Read Also : KGF2: ప్రశాంత్ నీల్ అష్ట దిగ్బంధనం.. ఆర్ఆర్ఆర్‌కి చెక్ పెట్టేస్తారా?