రికార్డులు బద్ధలు కొట్టిన KGF: Chapter 2

  • Published By: Subhan ,Published On : May 20, 2020 / 05:26 AM IST
రికార్డులు బద్ధలు కొట్టిన KGF: Chapter 2

Updated On : May 20, 2020 / 5:26 AM IST

KGF: Chapter 2 శాటిలైట్ హక్కులు రికార్డులు కొల్లగొట్టాయి. సినిమా నిర్మాతలు భారీ మొత్తంలో రూ.120కోట్లకు అమ్ముకున్నారు. దీనిపై అధికారికంగా సమాచారం లేకపోకపోయినా.. ఇండస్ట్రీ కోడైకూస్తుంది. ఏ ఛానెల్ కొట్టేసిందో కానీ, రూ.120కోట్లకు  KGF: Chapter 2 సొంతం చేసుకుంది. కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రయిమ్ 55 కోట్లకు తీసుకుందని వార్తలు నేషనల్ మీడియాలో గుప్పుమన్నాయి. 

southern star Yash లీడ్ రోల్‌లో కనిపించిన ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సెకండ్ పార్ట్ మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. దక్షిణాది యాక్టర్ అయిన యాష్.. రాబోయే సినిమా లుక్.. ఓ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రవీనా టాండన్ కూడా కనిపించనున్నట్లు సమాచారం. యాష్ కు ధీటుగా విలన్ రోల్ లో మెప్పించడానికి సంజయ్ దత్‌ను ఎంచుకున్నాడు డైరక్టర్. 

కొద్ది రోజుల ముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో సంజయ్ దత్ ఉన్న పోస్టర్  విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో డార్క్ బ్యాక్ గ్రౌండ్.. తో ఉన్న పోస్టర్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. KGF చాప్టర్ 2లో యష్ సరసన శ్రీనిధి శెట్టి అలరించనుంది. ఈ అక్టోబరులో సినిమా రిలీజ్ కానుంది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానుల్లో ఎదురుచూపులు మొదలయ్యాయి. నాన్ థియేటర్ హక్కుల రూపంలోనే దాదాపు 200 కోట్లకు పైగా వ్యాపారం జరిగేలా కనిపిస్తోంది. 

Read: శ్రీదేవి ఇంట్లో కరోనా కలకలం