KGF star Yash Birthday 3 fans passed away due to Electric Shock while installing Banners in Karnataka
Yash Birthday : నేడు కన్నడ స్టార్ హీరో యశ్ పుట్టిన రోజు. కన్నడలో సీరియల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి అనంతరం హీరోగా మారి తన సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు యశ్. ఇక KGF సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. KGF సినిమాలతో యశ్ కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని మార్చేశాడు. దీంతో యశ్ కి కర్ణాటకలోనే కాక దేశమంతా అభిమానులు ఏర్పడ్డారు.
నేడు యశ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక కర్ణాటకలో అయితే అభిమానులు బ్యానర్లు కట్టి, కేక్ కటింగ్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే యశ్ పుట్టిన రోజు వేడుకలకు సిద్ధం చేస్తుండగా ముగ్గురు యువకులు మరణించడంతో విషాదం నెలకొంది.
కర్ణాటక గడగ్ జిల్లాలోని సురంగి గ్రామంలో యశ్ అభిమానులైన ముగ్గురు యువకులు నేడు యశ్ పుట్టిన రోజు కావడంతో బ్యానర్స్ కట్టి శుభాకాంక్షలు తెలుపుదామని బ్యానర్స్ రెడీ చేయించారు. ఇవాళ తెల్లవారుజామున ఆ బ్యానర్స్ కడుతుండగా పక్కనే ఉన్న పవర్ లైన్ కి బ్యానర్స్ కి ఉన్న ఇనుము ఫ్రేమ్స్ తగిలి ఆ ముగ్గురు యువకులకు హై వోల్టేజ్ షాక్ కొట్టింది. దీంతో ఆ యువకులు అక్కడికక్కడే పడిపోవడంతో వేరే యువకులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Also Read : Manchu Lakshmi : ముంబైలో మంచు లక్ష్మి కొత్త ఇల్లు చూశారా? పూర్తిగా ముంబైకి మకాం మార్చేసిన లక్ష్మి మంచు..
దీంతో ఆ యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని హనుమంత్(24), మురళి(20), నవీన్(20).. అనే ముగ్గురు యువకులు ఈ ఘటనలో మరణించినట్లు తెలిపారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే చంద్రు లమని ఆ కుటుంబాలని పరామర్శించి, మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఇనుము ఫ్రేమ్స్ ఉన్న బ్యానర్స్ వాడొద్దు అని కోరుకుంటున్నాను. హీరో యశ్ వచ్చి ఈ అభిమానుల కుటుంబాలని పరామర్శించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నారు. ఈ ఘటన కర్ణాటక వ్యాప్తంగా యశ్ అభిమానుల్లో, ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
Yash 3 fans dead electric shock in Karnataka pic.twitter.com/QQGm79wHme
— Prakasha Lamani (@LamaniPrakasha) January 8, 2024