Khushboo Brother Passes Away
Khushboo: ఒకప్పటి సౌత్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ఇక్కడ కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తనకు వచ్చిన ప్రతి ఆఫర్‌ను చేసుకుంటూ వెళ్తోంది ఈ సీనియర్ హీరోయిన్. కాగా, కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఖుష్బూ తన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.
Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ
అయితే తాజాగా ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఖుష్బూ సోదరుడు అబు బక్కర్ ఇవాళ మృతి చెందినట్లుగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. తన సోదరుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అయితే ఇవాళ ఆయన మృతి చెందడంతో తాను తీవ్ర దు:ఖంలోకి వెళ్లిపోయానని ఆమె పేర్కొంది. తమకు ఇష్టమైన వాళ్లు ఎప్పటికీ తమతోనే ఉండాలని కోరుకుంటాం. కానీ సమయం వచ్చినప్పుడు వాళ్లు మనల్ని వదిలి వెళ్లిపోతారు. తన సోదరుడి జీవన ప్రయాణం నేటితో ముగిసిందని ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
నటి కుష్బూకు తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్యాంకర్
తన సోదరుడి ఆరోగ్యం బాగుపడాలని చాలా మంది కోరుకున్నారని.. ఆయన కోసం ప్రార్ధించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఆమె తెలిపింది. ఇక తన సోదరుడి ఆత్మకు శాంతి కలగాలని అందరూ ప్రార్ధించండి అంటూ సోషల్ మీడియాలో ఖుష్బూ పోస్ట్ చేసింది. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు ఖుష్బూ సోదరుడి మృతిపట్ల తమ విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన సోదరుడు మృతి చెందాడని.. అతడి పేరు అబ్దుల్లా అంటూ కొన్ని వెబ్ సైట్స్ పేర్కొంటున్నాయని తెలుసుకున్న ఖుష్బూ, అబ్దుల్లా తన చిన్నసోదరుడు అని.. అతడు బాగానే ఉన్నాడని.. దయచేసి పూర్తి విషయాలు తెలుసుకుని వార్తలు రాయాల్సిందిగా తాజాగా ఆమె ట్విట్టర్ లో కోరింది.
#NewProfilePic Will miss you everyday Bhaijaan
. Finally you are at peace. Rest well. ???? pic.twitter.com/vHVRSOwosc— KhushbuSundar (@khushsundar) December 17, 2022
His name was Abubacker. Please do not be so careless and callous in someone’s grief. Your insensitive attitude hurts. Abdullah is my last brother, and he is doing well. https://t.co/y0FyROQNqr
— KhushbuSundar (@khushsundar) December 17, 2022