Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ

కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత..సీనియర్ నటి కుష్బూ కూడా తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సిని నటి కుష్యూ హాజరైన కుష్బూ..‘రండి..చూడండీ..నేర్చుకోండీ అనే మాటలు టీఆర్ఎస్ వర్తిస్తాయని మాకు కాదు అంటూ చురకలు వేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ వ్యాఖ్యానించారు.

Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ

Bjp Leader Khushboo Criticizes Trs Government

BJP leader Khushboo criticizes TRS government : అందమైన హైదరాబాద్‌ నగరంలో కార్యవర్గ సమావేశం కోసం వస్తున్న వాట్సాప్‌ యూనివర్సిటీకి స్వాగతం అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. జుమ్లా జీవులందరికీ స్వాగతమంటూ కేటీఆర్ సెటైరిక్ గా బీజేపీ దళానికి స్వాగతం పలికారు. దమ్‌ బిర్యానీ, ఇరానీ ఛాయ్‌ను ఆస్వాదించడం మర్చిపోవద్దు అంటూ తనదైన శైలిలో సూచించారు. అంతేకాదు హైదరాబాద్ వస్తున్న బీజేపీ నేతలు తెలంగాణ పాలన ఏంటో..మేం చేసిన అభివృద్ధి ఏంటో..టీఆర్ఎస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలేంటో.. మేం కట్టిన ప్రాజెక్టులు ఏంటో తెలుసుకోండీ..మీ మీ రాష్ట్రాల్లో అమలు చేయండీ అంటూ బీజేపీకి చురకలు వేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత..సీనియర్ నటి కుష్బూ కూడా తనదైన శైలిలో స్పందించారు. టీఆర్ఎస్ కు చురకలు అంటించారు. బీజేపీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సిని నటి కుష్యూ హాజరైన కుష్బూ..‘రండి..చూడండీ..నేర్చుకోండీ అనే మాటలు టీఆర్ఎస్ వర్తిస్తాయని మాకు కాదు అంటూ చురకలు వేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అందరు కోరుకుంటున్నారని..తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది అధికారంలోకి వచ్చేది బీజేపీ మాత్రమేనని కుష్బూ ధీమా వ్యక్తం చేవారు. ప్రాంతీయ పార్టీలో బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయి అంటూ విమర్శించారు.

టీఆర్ఎస్ ను చూసి బీజేపీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని..బీజేపీని కూడా టీఆర్ఎస్ నేతలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని బీజేపీ అధినాయకత్వం అంతా తెలంగాణ వచ్చిన సందర్భంగా ఇప్పటికైనా బీజేపీని చూసి టీఆర్ఎస్ నేర్చోవాలని సూచించారు. ఉత్తరాధిలో బీజేపీ హవా కొనసాగుతోందని..బీజేపీ చేసే అభివృద్ధే దానికి నిదర్శనం అని అన్న కుష్బూ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.