ఖుష్బూ కూతురు చెప్పిన కొత్త సంగతి.. హీరోయిన్ గా లాంఛ్ చేయమ్మా అంటే ఖుష్బూ ఏమందంటే..
తన పొడవు 5.11 అని, దీని గురించి కూడా తాను దిగులు చెందుతున్నట్లు చెప్పింది.

Avantika Sundar
సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఖుష్బూ సుందర్ గురించి అందరికీ తెలుసు. ఖుష్బూ సుందర్, సినీ నిర్మాత సుందర్.సి దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు అవంతిక సుందర్. ఆమెకు సినీ ఇండస్ట్రీలోకి రావాలని ఉంది. కానీ, తన తల్లిదండ్రులు తనను సినీ రంగానికి పరిచయం చేయట్లేదని చెబుతోంది. అవంతిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
“నా తల్లిదండ్రులు నన్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని నేను ఎన్నడూ అనుకోను. వాళ్లు నన్ను అలా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్న కోరికకూడా నాకు వ్యక్తిగతంగా లేదు. నా వద్దకే ఎవరో వచ్చి అవకాశాలు ఇస్తారని కూడా నేను అనుకోను. నా ప్రయత్నాలు నేను చేస్తాను” అని చెప్పింది.
అంటే, తన తల్లిదండ్రుల సాయం లేకుండానే సినీ ఇండస్ట్రీలో ప్రయత్నాలు కొనసాగిస్తానని అవంతిక చెప్పింది. తన తల్లిదండ్రులు ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన వారై ఉండడంతో తనకు ఆ అడ్వంటేజ్ ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందేనని చెప్పింది.
తనను నేరుగా సినీ పరిశ్రమకు పరిచయం చేయకపోయినప్పటికీ కనీసం ఇండస్ట్రీకి చెందిన ఎవరినైనా పరిచయం చేయాలని తన తల్లి ఖుష్బూను అడుగుతున్నానని అవంతిక తెలిపింది.
తన తల్లిదండ్రులు తన యాక్టింగ్ కెరీర్‌ను లాంచ్ చేయడానికి ప్రయత్నించలేదని, తాను సొంతంగా సినీ ఇండస్ట్రీలోని ప్రవేశించాలని వారు భావిస్తారని అవంతిక తెలిపింది. తాను కూడా తన సొంత ప్రయత్నాల ద్వారానే సినీ ఇండస్ట్రీలోని రావాలని అనుకుంటున్నానని చెప్పింది.
అవంతిక లండన్‌లో నటనలో శిక్షణ తీసుకుంది. స్టార్ కిడ్‌గా తనకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా కూడా తన వ్యక్తిత్వానికి ఆ స్కూల్ రూపుదిద్దిందని తెలిపింది. సాధారణంగా ఒక నటి ఉండాల్సిన ఎత్తుకంటే తాను పొడవు ఉన్నానని అవంతిక తెలిపింది. తన పొడవు 5.11 అని, దీని గురించి కూడా తాను దిగులు చెందుతున్నట్లు చెప్పింది.