Kiara Advani fans are anger on Sidharth Malhotra Raashii Khanna chemistry in Yodha movie event
Kiara Advani : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.. హీరో సిద్దార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత ఫెస్టివల్స్ టైములో తమ ఫోటోషూట్స్ తో ఈ జంట అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఆ ఫొటోలు చూసిన నెటిజెన్స్ సైతం.. కియారా-సిద్దార్థ్ ని లవ్లీ కపుల్, పర్ఫెక్ట్ కపుల్ అంటూ కితాబులు ఇచ్చేవారు. కానీ తాజాగా ఓ వీడియో కియారా అభిమానులను బాధ పెడుతుంది.
సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా రాశి ఖన్నా, దిశా పటాని హీరోయిన్స్ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘యోధ’. మార్చి 15న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో ఉన్న చిత్ర యూనిట్.. ప్రెస్ మీట్స్ అంటూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే రాశి ఖన్నా, సిద్దార్థ్ మల్హోత్రా కలిసి రాజస్థాన్ జైపూర్ లో జరిగిన ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. రిలీజ్ చేసిన సాంగ్స్ లో రాశి, సిద్దార్థ్ కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంది.
Also read : SSMB29 : రాజమౌళి, మహేష్ సినిమా ఓపెనింగ్‌కి.. జేమ్స్ కామెరాన్ అతిథిగా..
అయితే ఆ కెమిస్ట్రీ.. పాటలో కంటే సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎక్కువ కనిపించిందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈవెంట్ లో రాశి ఖన్నా, సిద్దార్థ్ మల్హోత్రా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని చెట్టాపట్టాల్ వేసుకొని నడవడం అందర్నీ ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక అవి చూసిన కియారా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌స్క్రీన్ పైన ఇలా కలిసి నడవడం బాగానే ఉంటుంది. కానీ ఆఫ్ స్క్రీన్ లో ఇది కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యారేజ్ కపుల్ లాగా అలా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడవాల్సిన అవసరం ఏంటంటూ కియారా అభిమానులు ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కామెంట్స్ ని కూల్ చేసేలా కియారా రియాక్ట్ అవుతూ ఏమైనా కామెంట్ చేస్తారేమో చూడాలి.